PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత తేదీ ఇదే..? రూ. 2వేలు పడాలంటే ఈ 4 పనులు వెంటనే చేయండి..!
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత విడుదల తేది తెలిసిందోచ్.. రూ. 2వేలు ఎప్పుడైనా పడొచ్చు.. ముందుగా మీ డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి..

PM Kisan Yojana
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద లబ్ధిదారు రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు చొప్పున 3 విడతలలో (PM Kisan) విడుదల చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో విడుదల అవుతోంది. గత 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది. రాబోయే పీఎం కిసాన్ 20వ విడత జూన్ 2025లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
రూ. 2వేలు ఎప్పుడంటే? :
ప్రధానమంత్రి మోదీ పీఎం కిసాన్ 19వ విడతను బీహార్‌లోని భాగల్పూర్ నుంచి విడుదల చేశారు. నివేదికలు ప్రకారం.. జూన్ 20, 2025న బీహార్‌లోని సివాన్‌ను మోదీ సందర్శించే అవకాశం ఉంది. దేశంలోని 9.88 కోట్లకు పైగా రైతులకు 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది.
1. e-KYC తప్పనిసరి :
ఈ స్కీమ్ నుంచి డబ్బు (PM Kisan) పొందడానికి రైతులు e-KYC తప్పక పూర్తి చేయాలి. లేదంటే రావాల్సిన రూ. 2వేలు ఆగిపోవచ్చు. మీ సమీపంలోని CSC సెంటర్‌లో (pmkisan.gov.in) అధికారిక వెబ్‌సైట్ e-KYC కూడా చేయవచ్చు.
2. ల్యాండ్ వెరిఫికేషన్ :
మీ వ్యవసాయ భూమి డాక్యుమెంట్లలో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి. ఈ రికార్డులను వెంటనే అప్‌డేట్ చేయించుకోవాలి. అనేక రాష్ట్రాల్లో, రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతు రిజిస్ట్రీ వ్యవస్థలో కూడా రిజిస్టర్ చేసుకోవాలి.
3. బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ లింక్ :
ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంకు అకౌంట్లలో మాత్రమే రూ. 2వేలు పడతాయి. బ్యాంకు అకౌంట్ NPCIలో సరిగ్గా మ్యాప్ చేయాలి. బ్యాంకును విజిట్ చేసి లింక్ అయిందో లేదో చెక్ చేయండి.
4. స్టేటస్ ఇలా చెక్ చేయండి :
కొన్నిసార్లు, టెక్నికల్ లేదా డాక్యుమెంట్ ఇష్యూ కారణంగా పేమెంట్ ఆగిపోవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే.. పీఎం కిసాన్ పోర్టల్ విజిట్ చేసి ‘Beneficiary Status’, ‘Payment Status’ చెక్ చేయండి.