Lava Storm Lite 5G : లావా స్టార్మ్ లైట్ 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర జస్ట్ రూ.7,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Lava Storm Lite 5G : కొత్త లావా స్మార్ట్ లైట్ 5G ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది.. ఈ ఫోన్ అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..

Lava Storm Lite 5G : లావా స్టార్మ్ లైట్ 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర జస్ట్ రూ.7,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Lava Storm Lite 5G

Updated On : June 19, 2025 / 12:19 PM IST

Lava Storm Lite 5G : కొత్త లావా ఫోన్ కావాలా? బడ్జెట్ కొనుగోలుదారులు రూ. 10వేల లోపు ధరలో కొత్త లావా 5G ఫోన్ (Lava Storm Lite 5G) కొనేసుకోవచ్చు. ఇటీవలే బడ్జెట్ ఫోన్ లావా స్టార్మ్ లైట్ 5Gని కంపెనీ లాంచ్ చేసింది.

కేవలం రూ. 7,999 ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 120Hz స్క్రీన్ ,5000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఈ లావా ఫోన్ ఫస్ట్ సేల్ అమెజాన్‌లో జూన్ 19న మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది.

Read Also :  Whatsapp AI image : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై AI ఫొటోలు ఈజీగా క్రియేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!

లావా స్టార్మ్ లైట్ 5G ధర రూ. 7,999 ఉంటుంది. కాస్మిక్ టైటానియం, ఆస్ట్రల్ బ్లూ అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ డిజైన్ బడ్జెట్ ధరలో వస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ స్టార్మ్ లైట్ కలిగి ఉంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్ (4400,000) కన్నా ఎక్కువ Antutu స్కోర్‌ను కలిగి ఉంది. భారత మార్కెట్లోకి ఈ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని లావా పేర్కొంది.

మల్టీ టాస్కింగ్, క్యాజువల్ గేమింగ్ కు బెస్ట్ ఫోన్.. ఈ లావా ఫోన్ 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.

హై రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్‌తో పాటు టచ్ రెస్పాన్స్‌ను అందిస్తుంది. లైట్ గేమింగ్‌కు బాగుంటుంది. లావా రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్‌, బ్యాటరీ లైఫ్ :
ఈ లావా ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీతో (Lava Storm Lite 5G) వస్తుంది. USB టైప్-C పోర్ట్ ద్వారా 15W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో రోజంతా వాడుకోవచ్చు. భారత మార్కెట్లో ఈ ఫోన్ అన్ని 5G బ్యాండ్‌లకు సపోర్టు చేస్తుంది.

కెమెరా ఫీచర్లు అదుర్స్ :
సోనీ IMX752 సెన్సార్‌తో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. 2MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంది. ఈ ఫోన్ 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.

Read Also : Jio Recharge Plan : జియో యూజర్లకు పండగే.. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో రోజుకు 2GB హైస్పీడ్ డేటా, ప్రైమ్, జియోహాట్‌స్టార్ ఫ్రీ..!

ఆండ్రాయిడ్ 15తో ప్రీ-ఇన్‌స్టాల్ అయింది. లావా, బ్లోట్‌వేర్ లేకుండా క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, అదనపు స్టోరేజీని అందిస్తుంది. సెక్యూరిటీతో పాటు ఈ ఫోన్ ఫేస్ అన్‌లాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.