Whatsapp AI image : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై AI ఫొటోలు ఈజీగా క్రియేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!

Whatsapp AI image : వాట్సాప్ చాట్‌లలో ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం.

Whatsapp AI image : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై AI ఫొటోలు ఈజీగా క్రియేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!

Whatsapp AI image

Updated On : June 17, 2025 / 4:58 PM IST

Whatsapp AI image : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు  కొత్త ‘ఇమాజిన్’ ఫీచర్‌ ద్వారా చాట్‌లలో నేరుగా ఏఐ ఫొటోలను క్రియేట్ చేయొచ్చు. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా ప్లాట్‌ఫారమ్‌లో యూజర్లు ఈజీగా అద్భుతమైన ఏఐ ఫొటోలను జనరేట్ చేయొచ్చు.

మెటా ఏఐ ఇమేజ్ జనరేషన్ ఏంటి? :
మెటా AI ఇమేజ్ జనరేషన్ అనేది వాట్సాప్ యూజర్లు ఏఐను ఉపయోగించి ఫొటోలను క్రియేట్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ “Imagine” అనే పదంతో టెక్స్ట్ ప్రాంప్ట్‌ను టైప్ చేయగానే ఏఐ సెకన్లలో సంబంధిత ఫొటోను రూపొందిస్తుంది.

Read Also : Trump T1 Smartphone : ఆపిల్, శాంసంగ్‌కు పోటీగా.. ట్రంప్ T1 స్మార్ట్‌ఫోన్ ఆగయా.. 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు అదుర్స్..!

మెటా అడ్వాన్స్ ఏఐ సిస్టమ్స్ ద్వారా రన్ అవుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలు, భాషలలో మాత్రమే ఈ ఏఐ ఫీచర్ అందుబాటులో ఉంది.

సపోర్టు చేసే లాంగ్వేజీలివే :
ఇమేజ్ జనరేషన్‌తో సహా మెటా-ఏఐ ఫీచర్‌లు ప్రస్తుతం నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. సపోర్టు  కలిగిన దేశాలలో కూడా యూజర్లను బట్టి యాక్సెస్ మారవచ్చు.

ప్రత్యేకించి.. ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, హిందీ, ఇండోనేషియన్, పోర్చుగీస్, స్పానిష్, తగలోగ్, థాయ్, వియత్నామీస్ వంటి భాషలు ఉన్నాయి. మీకు ఇంకా ఆప్షన్ కనిపించకపోతే వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే.

AI ఫొటోలను ఎలా క్రియేట్ చేయాలి? :

  • మెటా ఏఐతో చాట్ ఓపెన్ చేయండి. (సపోర్టు ఉంటే మీ కాంటాక్ట్స్ కింద కనిపిస్తుంది).
  • మెసేజ్ ఫీల్డ్‌లో టైప్ చేయండి.
  • మీ ప్రాంప్ట్ తరువాత Imagine (ex.. sunset over a floating island).
  • Send ట్యాప్ చేయండి.
  • మెటా ఏఐ మీ ప్రాంప్ట్‌కు తగిన ఫొటోను జనరేట్ చేస్తుంది.
  • డౌన్‌లోడ్ కోసం ఫొటోపై హోవర్ చేసి మెను ఐకాన్ క్లిక్ చేయండి.

గ్రూపులో లేదా పర్సనల్ చాట్‌లో ఏఐ ఫొటోలు ఎలా? :

  • ఏదైనా పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌ని ఓపెన్ చేయండి.
  • మెసేజ్ ఫీల్డ్‌లో @ అని టైప్ చేసి ఆపై Imagine ఎంచుకోండి.
  • మీ ప్రాంప్ట్ రాయండి (ex.. futuristic city underwater).
  • Send ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • ఏఐ జనరేటెడ్ ఇమేజ్ మీ చాట్‌లో నేరుగా కనిపిస్తుంది.

AI ఇమేజ్‌ ఎలా అప్‌డేట్ చేయాలి? :
ఫొటోను ఎడిట్ చేయాలన్నా లేదా మరింత క్రియేటివిటీగా మార్చాలన్నా వాట్సాప్ కొత్త ప్రాంప్ట్‌తో ఫొటోను అప్‌డేట్ చేయొచ్చు.

మెటా ఏఐ చాట్‌ ప్రకారం..

  • గతంలో క్రియేట్ చేసిన ఫొటోపై మౌస్ కర్సర్ ఉంచండి.
  • మెను ఐకాన్ క్లిక్ చేసి ఆపై రిప్లయ్ ఇవ్వండి.
  • అప్‌డేట్ ప్రాంప్ట్‌ను టైప్ చేసి Send క్లిక్ చేయండి.

పర్సనల్ లేదా గ్రూపు చాట్‌లో.. :

  • AI ఫొటోపై హోవర్ చేసి మెనుపై క్లిక్ చేయాలి. ఆపై రిప్లయ్ ఇవ్వండి.
  • @ అని టైప్ చేసి మెటా ఏఐ ఎంచుకోవాలి.
  • ఆపై ఎడిట్ చేసిన ప్రాంప్ట్‌తో imagine ఆప్షన్ ఎంచుకోండి.
  • Send క్లిక్ చేయండి.
  • కొత్త ఇన్‌పుట్ ఆధారంగా చాట్ రిఫ్రెష్ ఫొటో కనిపిస్తుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలివే :
ఏఐ రూపొందించిన కంటెంట్ మెటా ప్రైవసీ విధానం, ఏఐ సర్వీసు నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ప్రాంప్ట్ ఆధారంగా కొన్ని ఫొటోలు రాంగ్ ఉండవచ్చు. అలాంటి ఫొటోలను రివ్యూ చేయండి.

Read Also : Motorola Edge 60 : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మోటోరోలా ఎడ్జ్ 60 సేల్ మొదలైంది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

అవసరమైతే మెటా ఏఐతో మీ చాట్‌ను డిలీట్ చేయొచ్చు. గతంలో షేర్ చేసిన సమాచారాన్ని డిలీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. పూర్తి వివరాల కోసం మెటా సపోర్టు పేజీలను చూడొచ్చు. వాట్సాప్‌లో మెటా ఏఐ ‘imagine’ ఫీచర్‌తో మరింత క్రియేటివిటీని పెంచుకోవచ్చు.