Trump T1 Smartphone : ఆపిల్, శాంసంగ్‌కు పోటీగా.. ట్రంప్ T1 స్మార్ట్‌ఫోన్ ఆగయా.. 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు అదుర్స్..!

Trump T1 Smartphone : ఆపిల్ ఐఫోన్‌కు పోటీగా ట్రంప్ T1 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. 50MP కెమెరా, ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

Trump T1 Smartphone : ఆపిల్, శాంసంగ్‌కు పోటీగా.. ట్రంప్ T1 స్మార్ట్‌ఫోన్ ఆగయా.. 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు అదుర్స్..!

Trump T1 Smartphone

Updated On : June 17, 2025 / 3:36 PM IST

Trump T1 Smartphone : ఆపిల్ ఐఫోన్, శాంసంగ్ కంపెనీలకు పోటీగా ట్రంప్ మొబైల్ వచ్చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికమ్యూనికేషన్ రంగంలోకి ప్రవేశించారు. ఆయన కంపెనీ ట్రంప్ (Trump T1 Smartphone) మొబైల్ ‘మేడ్ ఇన్ అమెరికా’తో సరికొత్త T1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికాలో తయారైంది. రాయిటర్స్ ప్రకారం.. ట్రంప్ మొబైల్ కంపెనీ దేశీయ కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు.

Read Also : SBI Home Loans : హోం లోన్ తీసుకున్నారా? రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ.. ఇక ఈఎంఐ ఎంత తగ్గుతుందంటే?

ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఈ కొత్త కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ అమెరికాలో ప్రధాన టెలికాం ఆపరేటర్‌గా పనిచేస్తోంది.

ఈ సందర్భంగా ట్రంప్ జూనియర్ మాట్లాడుతూ.. అమెరికాలో టెలికం పరిశ్రమకు చెందిన అత్యుత్తమ నిపుణులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు.

అమెరికాలోని మొబైల్ వినియోగదారులకు సరైన ధరకు మొబైల్ క్యారియర్ నుంచి అద్భుతమైన సర్వీసులను అందించనున్నట్టు తెలిపారు.

ట్రంప్ టెలికాం కంపెనీ మొబైల్ వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా పని చేస్తుంది. మూడు ప్రధాన అమెరికన్ వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి నెట్‌వర్క్ సామర్థ్యాన్ని కొనుగోలు చేసింది.

ట్రంప్ T1 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు :
ట్రంప్ కంపెనీ ట్రంప్ మొబైల్ కూడా స్మార్ట్‌ఫోన్ T1 ఫోన్‌ను విడుదల చేసింది. ఈ గోల్డ్ కలర్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది.

ఈ ఫోన్ ధర 499 డాలర్లు (సుమారు రూ. 42,893). ఈ ట్రంప్ ఫోన్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు నుంచి 100 డాలర్ల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

ట్రంప్ మొబైల్ T1 ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. డిస్‌ప్లే 6.8-అంగుళాలు, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా 50MP, 2MP డెప్త్. 2MP మాక్రో కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

ట్రంప్ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ట్రంప్ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్‌కు సపోర్టు ఇస్తుంది.

అమెరికాలో తయారైన ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ :
ట్రంప్ మొబైల్ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ T1 ఫోన్‌ను ‘డిజైన్డ్ అండ్ బిల్ట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్’ అనే ట్యాగ్‌తో మార్కెట్ చేస్తోంది. విదేశీ బ్రాండ్‌లకు బదులుగా స్వదేశీ బ్రాండ్ల కోసం చూస్తున్న వినియోగదారులే లక్ష్యమని కంపెనీ చెబుతోంది.

ప్రతి ఏడాది అమెరికలో 60 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు అవుతున్నాయి. ఆసక్తికరంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నీ యూఎస్ బయట తయారైనవే కావడం గమన్హారం.

సర్వీస్ ప్లాన్ ధరలివే :
ట్రంప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ట్రంప్ ఒక సర్వీసు ప్లాన్ కూడా ప్రారంభించారు. సర్వీసు కోసం, వినియోగదారులు ప్రతి నెలా 47.45 డాలర్లు (సుమారు రూ. 4,0787) చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ధర ట్రంప్ 47వ అధ్యక్షుడిని సూచిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్, టెక్స్ట్, డేటా వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : SBI Amrit Vrishti FD : సీనియర్ సిటిజన్లకు షాక్.. SBI అమృత్ వృష్టి FD రేట్లు తగ్గింపు.. కొత్త వడ్డీ రేట్లు, పెనాల్టీ వివరాలివే..!

ట్రంప్ కంపెనీ 100 కన్నా ఎక్కువ దేశాలలో వినియోగదారులకు 24/7 రోడ్‌సైడ్ అసిస్టెంట్, టెలిహెల్త్ సర్వీసు, డివైజ్ ప్రొటెక్షన్, ఫ్రీ ఇంటర్నేషనల్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది.

అమెరికాలో 250 సీట్ల కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. వాస్తవానికి ఈ సర్వీసు సెంటర్ ఆటోమేటిక్ సిస్టమ్ కాదు. ఈ కస్టమర్ సపోర్ట్ సెంటర్ అమెరికాలో 24/7 సర్వీసులను అందిస్తుంది.