SBI Amrit Vrishti FD : సీనియర్ సిటిజన్లకు షాక్.. SBI అమృత్ వృష్టి FD రేట్లు తగ్గింపు.. కొత్త వడ్డీ రేట్లు, పెనాల్టీ వివరాలివే..!

SBI Amrit Vrishti FD : ఎస్బీఐ FD కస్టమర్లకు బిగ్ షాక్.. అమృత్ వృష్టి యోజనపై వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి.. కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

SBI Amrit Vrishti FD : సీనియర్ సిటిజన్లకు షాక్.. SBI అమృత్ వృష్టి FD రేట్లు తగ్గింపు.. కొత్త వడ్డీ రేట్లు, పెనాల్టీ వివరాలివే..!

SBI Amrit Vrishti FD

Updated On : June 17, 2025 / 2:58 PM IST

SBI Amrit Vrishti FD : సీనియర్ సిటిజన్లకు షాకింగ్ న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్ డ్ డిపాజిట్ కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎస్బీఐ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్లలో ఒకటైన అమృత్ వృష్టి యోజనపై (SBI Amrit Vrishti FD)వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Read Also : SBI FD Rates : SBIలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? మీ వడ్డీ ఆదాయం తగ్గినట్టే.. 5 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందో తెలుసా?

అమృత్ వృష్టి యోజన పథకంలో కొత్త వడ్డీ రేట్లు జూన్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు గతంలో కన్నా తక్కువ వడ్డీని పొందుతాయి.

కొన్ని బ్యాంకులు FD రేట్లలో తగ్గింపును ప్రకటించాయి. ఈ కొత్త మార్పుతో అమృత్ వృష్టి పథకంలో ఎంత వడ్డీ వస్తుంది? క్యాన్సిల్ చేస్తే జరిమానా ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమృత వృష్టిపై వడ్డీ ఎంతంటే? :
అమృత్ వృష్టి FD పథకంలో ఉన్నారా? ఎస్బీఐ ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. అమృత్ వృష్టి డిపాజిట్ పథకంపై 25-బేసిస్ పాయింట్ల కోత విధించింది.

444 రోజుల FDలపై వడ్డీ రేట్లు 6.85శాతం నుంచి 6.60 శాతానికి తగ్గింది. ఈ పథకంలో చేరిన సీనియర్ సిటిజన్లు అదనపు ప్రయోజనాలను పొందుతారు.

అయితే, ఈ స్పెషల్ FD పథకంపై సీనియర్ సిటిజన్లు ఏడాదికి 7.10 శాతం వడ్డీని పొందుతారు. ఆర్బీఐ రెపో రేటును 50-బేసిస్ పాయింట్ల తగ్గింపు తర్వాత ఎస్బీఐ కూడా కస్టమర్లను షాకిచ్చింది.

అమృత్ వృష్టి యోజన పథకం కలిగిన కస్టమర్లపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కొత్త వడ్డీ రేటు జూన్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చింది.

Read Also : SBI Home Loans : హోం లోన్ తీసుకున్నారా? రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ.. ఇక ఈఎంఐ ఎంత తగ్గుతుందంటే?

జరిమానా (SBI Amrit Vrishti FD) ఎంతంటే? :
మెచ్యూరిటీ గడువుకు ముందే FDని క్యాన్సిల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. రూ. 5 లక్షల వరకు ముందస్తుగా క్యాన్సిల్ చేసిన రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD)పై 0.50 శాతం జరిమానా చెల్లించాలి.

రూ. 5 లక్షల నుంచి రూ. 3 కోట్ల కన్నా తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD)ముందస్తుగా క్యాన్సిల్ చేస్తే ఒక శాతం జరిమానా చెల్లించాలి. 7 రోజుల కన్నా తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎలాంటి వడ్డీ ఉండదు.