Motorola Edge 60 : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మోటోరోలా ఎడ్జ్ 60 సేల్ మొదలైంది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!
Motorola Edge 60 : మోటోరోలా ఎడ్జ్ 60 సేల్ ప్రారంభమైంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో ఈ ఫోన్ సరసమైన ధరకే లభ్యమవుతోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 60
Motorola Edge 60 : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ సేల్ (Motorola Edge 60) మొదలైంది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ, 5500mAh బ్యాటరీతో సహా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే ఈ ఫోన్ స్టైలిష్ వీగన్ లెదర్ బ్యాక్‌ను కూడా కలిగి ఉంది. వాటర్, డస్ట్ నిరోధకత కలిగి ఉంటుంది.
Read Also : OnePlus Nord 4 : అద్భుతమైన డీల్.. కేవలం రూ. 25వేల లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ 4 సొంతం చేసుకోండి..!
ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రారంభ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 60 5G ధర ఎంతంటే? :
మోటోరోలా ఎడ్జ్ 60 సింగిల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.25,999కు లభిస్తుంది. ఈ ఫోన్‌పై కస్టమర్లు లిమిటెడ్ టైమ్ రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. తద్వారా మోటోరోలా ఎడ్జ్ 60 5G ఫోన్ ధర రూ.24,999కి తగ్గుతుంది.
ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ డిజిటల్, అధికారిక మోటోరోలా ఇ-స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు వివిధ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 స్పెసిఫికేషన్లు :
ఈ మోటోరోలా మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాడ్-కర్వ్డ్ డిజైన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.
మీడియాటెక్ డైమన్షిటీ 7400 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఎడ్జ్ 60, 12GB వరకు ఫిజికల్ ర్యామ్ సపోర్టు ఇస్తుంది. వర్చువల్‌గా ఈ స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.
రాబోయే 3 ఏళ్ల వరకు మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉంది. కస్టమర్లు జిబ్రాల్టర్ సీ, పాంటోన్ షామ్‌రాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.