Oppo Smartphones : ఒప్పో లవర్స్ మీకోసమే.. రూ. 13వేల ధరలో 3 ఒప్పో స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Oppo Smartphones : కొత్త ఒప్పో ఫోన్ల కోసం చూస్తున్నారా? ఈ 3 ఒప్పో స్మార్ట్‌‌ఫోన్లలో ఏదైనా ఒకటి కొనేసుకోవచ్చు.

Oppo Smartphones : ఒప్పో లవర్స్ మీకోసమే.. రూ. 13వేల ధరలో 3 ఒప్పో స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Oppo Smartphones

Updated On : June 17, 2025 / 5:44 PM IST

Oppo Smartphones : ఒప్పో అభిమానుల కోసం అతి తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్ (Oppo Smartphones) అందుబాటులో ఉన్నాయి.

మీ బడ్జెట్ రూ. 13 వేలు అయితే ఈ ఒప్పో ఫోన్లను అసలు వదులుకోవద్దు. ఈ రేంజ్‌లో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే మీకు నచ్చిన మోడల్ ఏదైనా కొనేసుకోవచ్చు.

Read Also : Motorola Edge 60 : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మోటోరోలా ఎడ్జ్ 60 సేల్ మొదలైంది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

ప్రస్తుతం మార్కెట్లో ఒప్పో నుంచి అనేక సరసమైన మోడల్స్ లభ్యమవుతున్నాయి. మంచి కెమెరా, బ్యాటరీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగిన ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఈ మూడు ఒప్పో ఫోన్లలో ఏది కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి..

ఒప్పో K12x 5G :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ (Oppo Smartphones) డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. బ్యాక్ సైడ్ 32MP కెమెరాతో వస్తుంది.

అవసరమైతే ఫొటోలను రిపేర్ చేయవచ్చు. ఈ ఒప్పో ఫోన్ బ్యాటరీ బ్యాకప్ కోసం 5100mAh పవర్ కలిగి ఉంది. రూ. 12194 పరిధిలో కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో A3X :
ఈ ఒప్పో ఫోన్ అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 2100 నిట్స్ బ్రైట్‌నెస్, 6.67-అంగుళాల డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. 8MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్‌ను రూ. 11,499 కు కొనుగోలు చేయొచ్చు.

ఒప్పో A38 5G :
ఈ ఒప్పో 5G ఫోన్ (Oppo Smartphones) 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. 1612×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హెలియో G80 చిప్‌సెట్‌తో వస్తుంది. 4GB ర్యామ్, 64MP స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : Electric Scooter : అడ్వాన్స్ టెక్నాలజీతో బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 127కి.మీ రేంజ్.. ధర ఎంతంటే?

ప్రైమరీ కెమెరా 50MP, ఫ్రంట్ కెమెరా 5MP, 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ రూ. 11799కి కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ ఒప్పో ఫోన్లను ఆర్డర్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.