Electric Scooter : అడ్వాన్స్ టెక్నాలజీతో బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 127కి.మీ రేంజ్.. ధర ఎంతంటే?
Electric Scooter : అద్భుతమైన ఫీచర్లతో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు.. 127 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

Electric Scooter
Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? బజాజ్ ఆటో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) వచ్చేసింది. అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్‌లో మరో కొత్త ఈవీ స్కూటర్ లాంచ్ అయింది.
ఈ కొత్త బజాజ్ చేతక్ 3001 అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ వెర్షన్ చేతక్ 2903కు అప్‌గ్రేడ్ మోడల్. కంపెనీ రూ. 99,990 (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈవీ మార్కెట్లో డిమాండ్ తగినట్టుగా ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.
బ్యాటరీ, రేంజ్ :
బజాజ్ చేతక్ 3001 ఫీచర్లలో కొత్త బ్యాటరీ కాన్ఫిగరేషన్. ఈ స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్‌పై 3.0kWh బ్యాటరీని కలిగి ఉంది. అదనపు స్టోరేజీతో మెరుగైన రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
అడ్వాన్స్ బ్యాటరీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో సింగిల్ ఛార్జ్‌పై 127 కి.మీ దూసుకెళ్లగలదు. పట్టణాల్లో రోజువారీ రైడ్‌కు అనుకూలంగా ఉంటుంది.
ఛార్జింగ్ కెపాసిటీ (Electric Scooter) :
బజాజ్ 750W ఛార్జర్‌ను కలిగి ఉంది. 3 గంటల 50 నిమిషాల్లో 0 నుంచి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. క్విక్-ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంది. పట్టణ ప్రయాణికులకు లో డౌన్‌టైమ్ అందిస్తుంది. స్మార్ట్ బ్యాటరీ కలిగి ఉంది.
బూట్ స్పేస్, యుటిలిటీ :
బజాజ్ చేతక్ 3001లో 35 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. భారీ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంది. హెల్మెట్, కిరాణా సంచులను సులభంగా పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్ సింగిల్ రైడర్లకు, స్మాల్ ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్.
టెక్నాలజీ, ఫీచర్లు :
ఈ అప్‌గ్రేడ్‌లో బజాజ్ (Electric Scooter) ఎలాంటి ఫీచర్లను రివీల్ చేయలేదు. బజాజ్ చేతక్ 3001లో మ్యూజిక్ కంట్రోల్, ‘గైడ్ మీ హోమ్’ లైట్ ఫీచర్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ లైట్, ఆటో-ఫ్లాషింగ్ స్టాప్ లాంప్ వంటి ఫీచర్-రిచ్ ఆప్షన్లు ఉన్నాయి.
ఫుల్ మెటల్ బాడీతో వచ్చిన సింగిల్ ఈవీ స్కూటర్. ఎక్కువకాలం మన్నికతో పాటు మరింత భద్రతను అందిస్తుంది. అలాగే, ప్రీమియం ఫీచర్లతో ఇంటిగ్రేట్ అయింది.
బజాజ్ చేతక్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త బెంచ్‌మార్క్ కూడా. ఎక్కువ పర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్లకు బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు.