Post Office RD Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 100 పెట్టుబడితో రూ. 2లక్షలకు పైగా రాబడి..!

Post Office RD Scheme : పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD)పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అద్భుతమైన రాబడిని పొందవచ్చు..

Post Office RD Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 100 పెట్టుబడితో రూ. 2లక్షలకు పైగా రాబడి..!

Post office scheme

Updated On : June 19, 2025 / 1:51 PM IST

Post Office RD Scheme : పోస్టాఫీసులో డబ్బులు సేవింగ్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే మీకోసం (Post Office RD Scheme) అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది.

ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు.. కేవలం రోజుకు రూ. 100తో పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా రూ. 2లక్షలకు పైగా భారీగా రాబడిని పొందవచ్చు.

Read Also : Lava Storm Lite 5G : లావా స్టార్మ్ లైట్ 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర జస్ట్ రూ.7,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పెట్టుబడి పథకం ద్వారా ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. భారీగా వడ్డీ పొందవచ్చు.

అంతేకాదు.. ఈ పథకంలో డబ్బు పూర్తిగా సురక్షితం. చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడితో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది తెలుసుకుందాం.

పోస్టాఫీస్ RD పథకం 2025 :
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఒక పెట్టుబడి పథకం. ఇందులో 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా సేవ్ చేయాలి. ప్రతి నెలా చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. రిస్క్ లేని పెట్టుబడుల కోసం చూస్తున్న వారికి ఈ పథకం చాలా మంచిది.

పైగా ఇందులో పెట్టుబడితో ఏడాదికి 6.7 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చాలా సేఫ్ కూడా. చిన్న సేవింగ్స్ నుంచి భారీ మొత్తంలో డిపాజిట్ చేసేవారికి ఈ పెట్టుబడి పథకం అద్భుతంగా ఉంటుంది.

రోజూ రూ. 100 సేవింగ్ చేస్తే.. :
పోస్టాఫీస్ RD పథకంలో రోజుకు రూ. 100 మాత్రమే డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా రూ. 3వేల మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మొత్తం డిపాజిట్ మొత్తం 5 ఏళ్ల పెట్టుబడి కాలంలో రూ. 1,80,000 అవుతుంది. ఈ మొత్తంపై 6.7 శాతం రేటుతో రూ. 34,097 వడ్డీని పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో రూ. 2,14,097 భారీ మొత్తాన్ని పొందవచ్చు.

లోన్ సౌకర్యం :
పోస్టాఫీస్ RD పథకంలో సేవింగ్స్, రిటర్న్స్ మాత్రమే కాదు.. అవసరమైనప్పుడు ఆర్థిక సాయం కూడా పొందవచ్చు. పెట్టుబడిపై డబ్బు అవసరమైతే.. 12 నెలలు ముందుగా డిపాజిట్ చేసి ఉండాలి. ఆ తర్వాత మాత్రమే రుణం తీసుకోవచ్చు. మీ డిపాజిట్ మొత్తంలో 50శాతం వరకు రుణంగా పొందవచ్చు.

రికరింగ్ డిపాజిట్లపై పొందే వడ్డీ కన్నా ఈ రుణంపై 2శాతం ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే రికరింగ్ డిపాజిట్ బ్రేక్ చేయకుండా లోన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

5 ఏళ్లకు పైగా పొడిగింపు :
పోస్టాఫీస్ RD పథకం బెనిఫిట్స్ 5 ఏళ్ల తర్వాత కూడా కొనసాగించాలంటే.. గరిష్టంగా మరో 5 ఏళ్లకు పొడిగించవచ్చు. ఆ తర్వాత మీ అకౌంట్‌పై ప్రారంభంలో వచ్చిన అదే వడ్డీ రేటు అందుకుంటారు. సేవింగ్స్ మంచి రాబడిని పొందవచ్చు.

అకౌంట్ క్లోజింగ్ రూల్స్ :
మీకు నచ్చినట్టుగా అకౌంట్ ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. కొన్ని రూల్స్ తప్పక పాటించాలి. మీరు అకౌంట్ ఓపెన్ చేశాక పూర్తి ఏడాదికి ముందే క్లోజ్ చేస్తే.. సేవింగ్స్ అకౌంట్ ప్రకారం వడ్డీ పొందవచ్చు. ప్రస్తుతం 4శాతం, 6.7శాతం పొందవచ్చు. 3 ఏళ్ల తర్వాత మీ అకౌంట్ క్లోజ్ చేయొచ్చు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత తేదీ ఇదే..? రూ. 2వేలు పడాలంటే ఈ 4 పనులు వెంటనే చేయండి..!

మెచ్యూరిటీకి ఒక రోజు ముందు క్లోజ్ చేస్తే.. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ప్రకారం వడ్డీ అందుకోవచ్చు. ఒకవేళ మీ అకౌంట్ 2 ఏళ్ల 6 నెలల తర్వాత పొడిగించి క్లోజ్ చేస్తే.. 2 ఏళ్లకు 6.7 శాతం వడ్డీ వస్తుంది. కానీ, 6 నెలలకు 4 శాతం వడ్డీ మాత్రమే వస్తుంది.