Apple iPhone 11 Sale : అరే.. ఏంట్రా ఇది.. ఐఫోన్ 11 మోడల్ ఆపేసిన ఆపిల్.. ఫ్లిప్‌కార్ట్‌లో స్టాక్ ఉందిగా.. ఇప్పుడే కొనేసుకోండి.. ధర ఎంతంటే?

Apple iPhone 11 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫార్ అవుట్ ఈవెంట్లో (iPhone 14 Series) లాంచ్ చేసింది. అయితే ఆపిల్ మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఓల్డ్ జనరేషన్ ఐఫోన్ 11 (iPhone 11 Sale) పూర్తిగా నిలిపివేసింది.

Apple iPhone 11 Sale : అరే.. ఏంట్రా ఇది.. ఐఫోన్ 11 మోడల్ ఆపేసిన ఆపిల్.. ఫ్లిప్‌కార్ట్‌లో స్టాక్ ఉందిగా.. ఇప్పుడే కొనేసుకోండి.. ధర ఎంతంటే?

Apple discontinues iPhone 11, but it is still available for Rs 42,000 on Flipkart

Apple iPhone 11 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫార్ అవుట్ ఈవెంట్లో (iPhone 14 Series) లాంచ్ చేసింది. అయితే ఆపిల్ మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఓల్డ్ జనరేషన్ ఐఫోన్ 11 (iPhone 11 Sale) పూర్తిగా నిలిపివేసింది. ఆపిల్ ఫార్ ఈవెంట్ సందర్భంగా క్యూపర్టినో దిగ్గజం అధికారికంగా ఆపిల్ 11 (Apple iPhone 11) మోడల్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. 2019లో ఆపిల్ iPhone 11 Series లాంచ్ చేసింది. అయితే ఈ మోడల్ సేల్స్ నిలిపివేసినప్పటికీ కూడా కొన్ని ఏళ్ల పాటు iOS అప్‌డేట్‌లను పొందవచ్చు.

Apple discontinues iPhone 11, but it is still available for Rs 42,000 on Flipkart

Apple discontinues iPhone 11, but it is still available for Rs 42,000 on Flipkart

Apple అధికారిక స్టోర్‌ల నుంచి iPhone 11ని తొలగించనుంది. కానీ, ఐఫోన్ 11 స్టాక్‌లు ముగిసే వరకు ఫ్లిప్‌కార్ట్‌లో (iPhone 11 Sale in Flipkart) కొనుగోలు చేసుకోవచ్చు. Flipkart ప్లాట్ ఫారంలో ఇప్పటికీ iPhone 11 Series అందుబాటులో ఉంది. ఐఫోన్ 11 సిరీస్ బేస్ 64GB వేరియంట్ రూ. 41,999 వద్ద అందుబాటులో ఉంది. 128GB ఆప్షన్ ధర రూ. 54,900కి అందుబాటులో ఉంది. అయితే 256GB స్టోరేజీ ఆప్షన్ అందుబాటులో లేదు. ఐఫోన్ 11 మోడల్ ఫోన్ రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్, పర్పుల్, ఎల్లో మల్టీ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. ఈ ఫోన్ సరసమైన A13 బయోనిక్ చిప్‌సెట్, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

Apple discontinues iPhone 11, but it is still available for Rs 42,000 on Flipkart

Apple discontinues iPhone 11, but it is still available for Rs 42,000 on Flipkart

రాబోయే వారాల్లో, నెలల్లో iPhone 11 మోడల్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఆపిల్ ప్రవేశపెట్టిన కొత్త ఐఫోన్ 14 సిరీస్ చాలా ఖరీదైనది. దాంతో చాలామంది కస్టమర్‌లు సరసమైన ఐఫోన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికి ఆపిల్ iPhone 11 Series బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. మీరు 2022లో iPhone 11ని కొనుగోలు చేయాలా? ప్రత్యేకించి Apple 3 కొత్త జనరేషన్ iPhoneలను కొనాలా? అని ఆలోచిస్తున్నారా? మీరు బడ్జెట్‌ ఆధారంగా iPhone 12 లేదా iPhone 13 కొనుగోలు చేయవచ్చు. కొత్త ఐఫోన్‌లు ఎక్కువ ఏళ్లపాటు iOS అప్‌డేట్‌లు వస్తాయి. ఇక రెండవది iPhone 12 , iPhone 13 రెండింటికీ 5G సపోర్టు ఉంది.

Apple discontinues iPhone 11, but it is still available for Rs 42,000 on Flipkart

Apple discontinues iPhone 11, but it is still available for Rs 42,000 on Flipkart

భారత మార్కెట్లోకి అతి త్వరలోనే 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. ఇంతలో మీ ఫోన్ 5G రెడీగా ఉంచుకోవచ్చు. మరొక తేడా ఏమిటంటే.. కొత్త ఐఫోన్‌లు మరింత మన్నికైన డిస్‌ప్లే, రిఫ్రెష్డ్ డిజైన్, మెరుగైన బ్యాటరీతో వస్తాయి. అంతేకాదు.. iPhone 12, iPhone 13లలో కెమెరా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. అయితే, ఐఫోన్ 13 మరిన్ని ఫీచర్లతో వస్తుంది. వీడియో క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. అలాగే ఐఫోన్ 13 ఛార్జింగ్‌కు సపోర్టు కూడా అందిస్తుంది. అయితే ఇప్పుడు అన్ని iPhoneలు బాక్సులో ఛార్జర్ లేకుండానే మార్కెట్లోకి వస్తున్నాయి.

Read Also : Apple iPhone 12 : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 12.. మళ్లీ ధర పెరిగేలోపే వెంటనే కొనేసుకోండి!