Amazon Diwali Sale
Amazon Diwali Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13పై కూడా భారీ తగ్గింపు పొందవచ్చు. మీరు ఐఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.
ప్రస్తుతం, ఐఫోన్ 13 కొనుగోలుపై అద్భుతమైన (Amazon Diwali Sale) డీల్ పొందవచ్చు. ఈ ఆఫర్ ముగిసేలోగా కొనేసుకోండి. వాస్తవానికి ఐఫోన్ 13 2021లో లాంచ్ అయింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఐఫోన్ 13 క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఐఫోన్ మోడల్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ A15 బయోనిక్ చిప్, 6.10-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇంతకీ, ఫీచర్లు, ధర, ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 13 డిస్కౌంట్లు, ధర :
ఐఫోన్ 13కి మూడు స్టోరేజ్ (128GB, 256GB, 512GB) ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ లాంచ్ సమయంలో ధర రూ. 79,900గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ.43,900కు కొనుగోలు చేయొచ్చు. 128GB స్టోరేజ్ స్టాండర్డ్ మోడల్ ధర వద్ద లభ్యమవుతుంది. ఈ ఐఫోన్ రెండు బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్‌తో 5శాతం తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 13 ఫీచర్లు :
ఐఫోన్ 13 మోడల్ 6.10-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్ 1170×2532 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. హెక్సా-కోర్ ఆపిల్ A15 బయోనిక్ చిప్ కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండూ సపోర్టు ఇస్తాయి. ఐఫోన్ 13 మోడల్ 128GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది. iOS ద్వారా పవర్ పొందుతుంది. ఐఫోన్ 13 మోడల్ బరువు 174.00 గ్రాములు, 146.70 x 71.50 x 7.65mm కొలతలు కలిగి ఉంటుంది. వాటర్, డస్ట్ నిరోధకతకు ఐపీ68 రేటింగ్ కలిగి ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3జీ, 4జీ కొన్ని ఎల్టీఈ నెట్‌వర్క్‌లు బ్యాండ్ 40కి సపోర్టు) ఉన్నాయి. ఫోన్ సెన్సార్లలో బేరోమీటర్, కంపాస్/మాగ్నెటోమీటర్, సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఐఫోన్ 13లో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో రెండు 12MP బ్యాక్ సైడ్ లెన్స్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వినియోగించుకోవచ్చు.