Motorola Edge 60 Neo : మతిపొగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 నియో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Motorola Edge 60 Neo : మోటోరోలా ఎడ్జ్ 60 నియో ఫోన్ లాంచ్ టైమ్‌లైన్, ధర, కీలక ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. మోటోరోలా ఎడ్జ్ 60 నియో ఫోన్ ధర ఎంత ఉండొచ్చంటే?

Motorola Edge 60 Neo : మతిపొగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 నియో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Motorola Edge 60 Neo

Updated On : October 15, 2025 / 6:51 PM IST

Motorola Edge 60 Neo : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది. అతి త్వరలో భారత మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 60 నియో లాంచ్ కానుంది. మోటో ఎడ్జ్ 50 నియో తర్వాత కంపెనీ భారత మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 60 నియో లాంచ్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. లీక్‌లు, పుకార్ల ఆధారంగా కొన్ని కీలక స్పెషిఫికేషన్లు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్‌ మూడు కలర్ ఆప్షన్లలో రానుంది. మిడ్ రేంజ్ ఆఫర్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

ముఖ్యంగా, ఈ మోటోరోలా ఫోన్ ఎడ్జ్ 60 సిరీస్‌లో (Motorola Edge 60 Neo) చేరనుంది. ఇందులో ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో, ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్ ఉన్నాయి. మోటోరోలా వెనిల్లా ఎడ్జ్ 60 ఈ ఏడాది జూన్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. మోటో ఎడ్జ్ 60 నియో లాంచ్ టైమ్‌లైన్, స్పెషిఫికేషన్లకు సంబంధించి మరిన్ని ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

మోటో ఎడ్జ్ 60 నియో 5G లాంచ్ టైమ్‌లైన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 నియో ఈ నెలాఖరు నాటికి భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. మోటోరోలా ఆగస్టు 2024లో భారత మార్కెట్లో ఎడ్జ్ 50 నియో ఫోన్ లాంచ్ అయింది.

Read Also : Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

మోటో ఎడ్జ్ 60 నియో 5G స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 నియో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. పర్ఫార్మెన్స్, అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాలతో 4nm ప్రాసెస్, ఆక్టా-కోర్ సీపీయూ, మాలి-G615 MC2 జీపీయూ మల్టీ టాస్కింగ్, రెస్పాన్సివ్ గేమింగ్‌ అందిస్తుంది. అయితే, మోటో ఏఐ స్మార్ట్ నోటిఫికేషన్లు, కెమెరా ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లతో రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 15పై మోటో ఎడ్జ్ 60 నియో 5 మెయిన్ OS అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

ఈ ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR10+తో 6.36-అంగుళాల ఎల్టీపీఓ pOLED సూపర్ HD డిస్‌ప్లే కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 50MP సోనీ లైటియా సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్-కెమెరా సెటప్‌తో 68W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, ఎడ్జ్ 60 నియో భారత్ లాంచ్ లేదా స్పెసిఫికేషన్లకు సంబంధించి కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలను ధృవీకరించలేదు.

మోటో ఎడ్జ్ 60 నియో 5G ధర (అంచనా) :
పాత మోడల్ మోటో ఎడ్జ్ 50 నియో ప్రారంభ ధర రూ.23,999కు లాంచ్ అయింది. రాబోయే మోటో ఎడ్జ్ 60 నియో 5G ధర రూ.25వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు.