iPhone 15 Price
iPhone 15 Price : మీరు కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీ బడ్జెట్ దాదాపు రూ.50వేలు అయితే, ఐఫోన్ 15 బెస్ట్ మోడల్. ప్రస్తుతం డిస్కౌంట్ (iPhone 15 Price) ధరతో ఐఫోన్ 15 అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లతో రూ.10వేలకు పైగా డిస్కౌంట్ పొందవచ్చు.
అమెజాన్‌లో ఐఫోన్ 15 ధర :
భారత మార్కెట్లో ఐఫోన్ 15 ధర రూ.69,900కి లభిస్తుంది. అన్ని డిస్కౌంట్‌లతో రూ.60వేల కన్నా తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 16e మోడల్ కూడా ఇదే ధరకు అందుబాటులో ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది. ఆకర్షణీయమైన కెమెరా, డైనమిక్ ఐలాండ్, డిజైన్ కావాలంటే ఐఫోన్ 15 కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?..
అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15 (iPhone 15 Price) ధర రూ.9వేల తగ్గింపుతో రూ.60,990కి అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ క్రోమాలో రూ.64,900కి కొనుగోలు చేయొచ్చు. మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,800 కన్నా ఎక్కువ తగ్గింపును పొందవచ్చు. దాంతో ఐఫోన్ ధర దాదాపు రూ.59వేలకి తగ్గుతుంది.
కొనుగోలుదారులు నెలకు రూ.2,938 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో మరిన్ని ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. మీ పాత ఫోన్ ఐఫోన్ 15తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా ఫోన్ రూ.33,350 వరకు పొందవచ్చు. అదనంగా రూ.8,499కు ఆపిల్‌కేర్ సహా ప్రొటెక్ట్ ప్లస్ కూడా పొందవచ్చు.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 15 భారీ 6.1-అంగుళాల OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ ఐఫోన్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. ఈ ఐఫోన్ IP68 సర్టిఫికేట్ పొందింది. ఫొటోల విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఐఫోన్ 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.