iPhone 16 vs iPhone 16e : కొత్త ఐఫోన్ కావాలా? అతి చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16e కొనేసుకోవచ్చు.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
iPhone 16 vs iPhone 16e : అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 16, ఐఫోన్ 16e లభ్యమవుతున్నాయి. ఈ 2 ఐఫోన్లలో ఏది కొంటారో మీరే డిసైడ్ చేసుకోండి..

iPhone 16 vs iPhone 16e
iPhone 16 vs iPhone 16e : ఆపిల్ కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ (iPhone 16 vs iPhone 16e) ఐఫోన్ 16, ఐఫోన్ 16e కొత్త మోడల్ రెండింటిపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఆపిల్ ఐఫోన్ 16 కొంటే రూ. 11వేలు భారీ తగ్గింపు పొందవచ్చు. అత్యంత హాటెస్ట్ డీల్స్‌లో ఇదొకటి.
మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా ఫస్ట్ ఐఫోన్ తీసుకుంటున్నా ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు. అదే మీరు ఐఫోన్ 16e కొత్త మోడల్ కొనాలనుకుంటే.. అమెజాన్‌లో ఏకంగా రూ. 7,800 తగ్గింపుతో లభిస్తోంది. పైగా ఈ ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కలిగి ఉంది. ఇంతకీ, ఈ రెండు ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 16 డీల్ పొందాలంటే? :
భారత మార్కెట్లో రూ.79,900 ప్రారంభ ధరకు ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ మోడల్ రూ.7,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో అమెజాన్ అందిస్తోంది. దాంతో అసలు ధర నుంచి రూ.72,900కి తగ్గింది. మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ ఉంటే ఈఎంఐ ద్వారా అదనంగా రూ.4వేలు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఇంకా ధర తగ్గాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల OLED ప్యానెల్ 60hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ హై బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR డిస్‌ప్లే, ట్రూ టోన్‌కు సపోర్టు ఇస్తుంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ కోటింగ్‌తో వస్తుంది. ఐఫోన్ 16లో A18 బయోనిక్ చిప్‌సెట్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఐఫోన్ 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.
అంతేకాదు.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. పైగా IP68 సర్టిఫికేట్ కూడా కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ఫ్యూజన్ సెన్సార్, 12MP మాక్రో లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కూడా ఉంది.
ఆపిల్ ఐఫోన్ 16e డీల్ పొందాలంటే? :
అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ (Apple iPhone 16e) అతి తక్కువ ధరకే లభిస్తోంది. క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ. 7,800 తగ్గింపుతో పొందవచ్చు. సింగిల్ కెమెరా, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, నాచ్ డిస్‌ప్లే, కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది.
ఐఫోన్ 16eపై రూ.7,800 డిస్కౌంట్ :
అమెజాన్‌లో రూ.6,300 ధర తగ్గింపు తర్వాత రూ.53,600 ధరతో లభ్యమవుతుంది. HDFC, OneCard వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తంగా ధర దాదాపు రూ.52వేల వరకు తగ్గుతుంది. అలాగే, ఈఎంఐ లేదా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
ఐఫోన్ 16e ధరను ఇంకా తగ్గించాలనుకుంటే.. మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్ ఆధారంగా రూ.33,350 వరకు వాల్యూను పొందవచ్చు. 128GB వేరియంట్ ధర, బ్లాక్, అండ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు :
- 6.1-అంగుళాల OLED ప్యానెల్‌తో 60Hz రిఫ్రెష్ రేట్
- A18 చిప్‌సెట్, ఫేస్ ID, IP68 సర్టిఫికేషన్, అల్యూమినియం ఫ్రేమ్
- 8GB ర్యామ్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, జెన్మోజీ
- చాట్‌జీపీటి ఇంటిగ్రేషన్, రైటింగ్ అసిస్టెంట్ టూల్స్ వంటి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
- 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా
- యాక్షన్ బటన్, లేటెస్ట్ iOS 18 అప్‌డేట్, iOS26 అప్‌గ్రేడ్ ఆప్షన్