Apple iPhone 16 Price
Apple iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్. ఆపిల్ ఐఫోన్ 16 అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. గత ఏడాది ఫ్లాగ్‌షిప్ ఆపిల్ లైనప్ నుంచి బేస్ వేరియంట్‌గా మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ ఫోన్ ఆపిల్ ఇన్-హౌస్ ప్రాసెసర్‌తో వస్తుంది.
డ్యూయల్ సెన్సార్ సిస్టమ్ కూడా కలిగి (iPhone 16 Price) ఉంది. ఐఫోన్ 16 కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ కిర్రాక్ డీల్ అందిస్తోంది. సరసమైన ధరకే ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 డీల్ :
ఐఫోన్ 16 మోడల్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో అసలు ధర రూ.79,900 నుంచి రూ.62,999కి లభిస్తుంది. ఇంకా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో యూజర్లందరూ ఫోన్‌పై రూ.2,500 తగ్గింపుతో పాటు మెయిన్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ నుంచి ఈ వేరియంట్ బ్లాక్, పింక్, అల్ట్రామెరైన్, వైట్ టీల్ సహా 5 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 హై-ఆక్టేన్ పర్ఫార్మెన్స్ కోసం ఆపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో ఆపిల్ A18 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆపిల్ మల్టీ మెయిన్ OS అప్‌గ్రేడ్‌లతో iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ ప్రైమరీ మోడల్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజీతో పాటు 8GB ర్యామ్ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌కు IP68 సర్టిఫికేట్ కలిగి ఉంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 16 డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ షూటర్ 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఐఫోన్ (PDAF)తో 12MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది. 3561mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. మొత్తం మీద ఐఫోన్ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్ అని చెప్పొచ్చు.