Apple iPhone Air (Image Credit To Original Source)
Apple iPhone Air : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గిందోచ్. మీరు ఆపిల్ అల్ట్రా-స్లిమ్ ఐఫోన్ ఎయిర్‌కి అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇదే సరైన సమయం. విజయ్ సేల్స్ ప్రస్తుతం ఐఫోన్ ఎయిర్‌పై రూ.28వేల కన్నా తగ్గింపు అందిస్తోంది. కొన్ని నెలల క్రితమే ఐఫోన్ 17 లైనప్‌తో పాటు ఐఫోన్ ఎయిర్ లాంచ్ అయింది.
కానీ, ఇప్పుడు రూ.90,990 కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల OLED డిస్‌ప్లే , 48MP బ్యాక్ కెమెరాను అందిస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ ఎయిర్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Apple iPhone Air (Image Credit To Original Source)
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,900కు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ ఎయిర్ ప్రస్తుతం రూ.94,990కు లిస్ట్ అయింది. తద్వారా ధర రూ.24,910 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ప్రోమోషన్ టెక్నాలజీతో 6.5-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 48MP ఫ్యూజన్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. అయితే, 18MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ కేవలం 5.6mm మందంతో అల్ట్రా-స్లిమ్ ప్రొఫైల్ అందిస్తుంది. దాదాపు 165 గ్రాముల బరువు ఉంటుంది. ఆపిల్ అత్యంత సన్నని తేలికైన స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ ఎయిర్ ఒకటిగా చెప్పొచ్చు.