Apple MacBook Air
Apple MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ధర భారీగా తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆపిల్ 13-అంగుళాల డిస్‌ప్లే, ఇంటర్నల్ M4 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను లాంచ్ చేసింది.
దాంతో పాటు, 15-అంగుళాల వెర్షన్ కూడా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మీరు ఈ రెండు ల్యాప్‌టాప్‌లలో ఏదైనా కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఎందుకంటే ఈ మ్యాక్ ల్యాప్‌టాప్‌లు అమెజాన్‌లో తగ్గింపు ధరకే లభ్యమవుతున్నాయి. ఈ అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలంటే?
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్ :
13-అంగుళాల (16GB ర్యామ్ + 256GB స్టోరేజీ) మోడల్ మొదట రూ. 99,900కి లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో (Apple MacBook Air) మ్యాక్‌బుక్ ఎయిర్ M4 రూ. 83,990కి అందుబాటులో ఉంది. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేదా కూపన్‌లు లేకుండా రూ. 15,910 నేరుగా తగ్గింపు పొందవచ్చు.
ఇప్పుడు, 15-అంగుళాల వెర్షన్ కొనాలంటే కూడా భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ. 1,24,900 నుంచి తగ్గి రూ. 1,09,990 ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ ధరల తగ్గుదలతో పాటు అమెజాన్ ఈ డీల్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్పెషిఫికేషన్లు :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ ప్రొఫెషనల్స్‌తో పాటు విద్యార్థులకు ఇష్టమైన ఆప్షన్. అద్భుతమైన పర్ఫార్మెన్స్, కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M4 కంపెనీ కొత్త M4 చిప్‌తో రన్ అవుతుంది. 10-కోర్ సీపీయూ, వేరియంట్‌ను బట్టి 8 లేదా 10-కోర్ జీపీయూతో వస్తుంది.
Read Also : Apple iPhone 16e : కొంటే ఇలాంటి ఐఫోన్ కొనాలి.. iPhone 16e అతి చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి.. డోంట్ మిస్!
ఆసక్తిగల కొనుగోలుదారులు 32GB వరకు ర్యామ్, 2TB వరకు SSD స్టోరేజీతో కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. విస్పర్-క్వైట్‌లో రన్ అయ్యే వీడియో ఎడిటింగ్, కోడింగ్, గ్రాఫిక్స్ వర్క్ వంటి పనులకు బెస్ట్ అని చెప్పొచ్చు. 15-అంగుళాల మోడల్ ఎక్కువ స్క్రీన్ కోరుకునే వారికి భారీ డిస్‌ప్లే, బ్యాటరీని అందిస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. అయితే, సన్నని బెజెల్స్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ మరింత లీనమయ్యేలా చేస్తాయి. 13-అంగుళాల వేరియంట్ 53.8Wh బ్యాటరీతో వస్తుంది. 18 గంటల వరకు వినియోగాన్ని అందించగలదు.
15-అంగుళాల వెర్షన్ భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో ఇంకా ఎక్కువసేపు ఛార్జింగ్ వస్తుంది. నోట్‌బుక్‌లో మాగ్‌సేఫ్ ఛార్జింగ్, థండర్‌బోల్ట్ 4, USB-C పోర్ట్‌లు, Wi-Fi 6E సపోర్ట్, సురక్షితమైన లాగిన్ కోసం టచ్ ఐడీ కూడా ఉన్నాయి.
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర విషయానికి వస్తే.. 13-అంగుళాల వెర్షన్ దాదాపు రూ. 83,990కు కొనుగోలు చేయొచ్చు. మరోవైపు, 15-అంగుళాల ధర ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికీ, బిగ్ స్క్రీన్, బ్యాటరీతో, పవర్ పరంగా అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.