Atal Pension Yojana
Atal Pension Yojana : భవిష్యత్తు గురించి ఆందోళన అక్కర్లేదు. వృద్ధాప్యంలో డబ్బు కోసం ఎవరి మీద ఆదారపడాల్సిన పనిలేదు. ఇప్పటినుంచే మీ వంతు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం మొదలుపెడితే చాలు.. 60 ఏళ్లు నిండాక మీకు నెలవారీగా రూ. 5వేల వరకు పెన్షన్ వస్తుంది.
ఆ పెన్షన్‌తోనే మిగిలిన జీవితాన్ని గడిపేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఇప్పుడే అటల్ పెన్షన్ యోజన పథకం(APY)లో చేరడమే. వాస్తవానికి ఈ పథకం ఆదాయపు పన్ను పరిధిలోకి రాని భారతీయులకు వర్తిస్తుంది.
ఈ పథకం కింద 60 ఏళ్ల వయస్సు వరకు కొద్ది మొత్తంలో చందా చెల్లిస్తూ ఉండాలి. వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ఈ అటల్ పెన్షన్ కింద మీకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. మీకు ఎంత పెన్షన్ వస్తుందనేది మీరు చెల్లించే మొత్తంపై ఆధారపడి ఉంటుంది.
మీ వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండి, మీరు పన్ను చెల్లింపుదారు కాకుంటే మీరు కూడా ఈ పథకం కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పథకంలో ఎలా చేరాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇలా అప్లై చేయండి :
మీరు అటల్ పెన్షన్ యోజనకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు మీరు బ్యాంకుకు వెళ్లి ఫారమ్ నింపాలి. మీరు నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం, నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి APY కోసం సెర్చ్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌లో మీ వివరాలను నింపిన తర్వాత, ఫారమ్‌ను సమర్పించి ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకోండి. తద్వారా ప్రతి నెలా ప్రీమియం మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా డబ్బులు కట్ అవుతాయి. అయితే, ఈ APY ఫారమ్‌లో నామినీ వివరాలను ఇవ్వడం అసలు మర్చిపోవద్దు.
దరఖాస్తు విధానం ఇలా :
ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి :