Holi 2025 : హోలీ రోజున మీ మొబైల్ ఫోన్లు జాగ్రత్త.. ఇలా చేస్తే రంగు నీళ్లలో పడినా ఫోన్ పాడైపోదు.. తప్పక తెలుసుకోండి!
Holi 2025 : హోలీ ఆడే సమయంలో మీ మొబైల్‌లోకి నీరు లేదా రంగు వెళ్లి పాడైపోవచ్చు. అందుకే మీ మొబైల్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులను పాటించండి.

Protect Smartphones
Holi 2025 : భారత్‌లో ప్రతి ఏడాదిలో వివిధ రకాల పండుగలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అందరూ అనేక పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి, రక్షాబంధన్, దసరా, ఈద్ పండగల మాదిరిగానే హోలీ కూడా ఒక పండుగ. హోలీ అనేది రంగుల పండుగ. ఈ రోజున ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని ఈ పండుగను జరుపుకుంటారు. ఈ కలర్ ఫుల్ డే రోజున గుజియా, అనేక ఇతర రకాల వంటకాలను కూడా తయారు చేస్తారు.
ప్రత్యేకించి అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అయితే, ఈ సమయంలో మొబైల్ ఫోన్ల గురించి కూడా ఆందోళన చెందుతారు. ఆ రంగు లేదా నీరు ఎక్కడా వాటిపై పడుతుందేమో అని భయపడుతుంటారు. ఒకవేళ, ఇలా జరిగితే మీ మొబైల్ ఫోన్ పాడైపోవచ్చు. ఇకపై, హోలీ ఆడే సమయంలో మీ మొబైల్ గురించి ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. మీ మొబైల్‌ను నీరు, రంగుల నుంచి కాపాడే కొన్ని అద్భుతమైన పద్ధతులను ఓసారి తెలుసుకోండి.
హోలీ రోజున మొబైల్ సేఫ్టీ టిప్స్ మీకోసం.. :
మీరు హోలీ ఆడే ముందు మీ మొబైల్‌ను వాటర్‌ప్రూఫ్ కవర్‌లో ఉంచుకోవచ్చు. మార్కెట్లో అనేక రకాల పౌచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీ మొబైల్‌ను ఉంచుకుని హాయిగా హోలీ ఆడవచ్చు. ఎందుకంటే మొబైల్‌లోకి కలర్ లేదా వాటర్ వెళ్లవు. మీరు ఈ పర్సు వద్దని భావిస్తే మీరు మొబైల్‌ను ఏదైనా పాలిథిన్‌లో కూడా ఉంచవచ్చు.
మీరు హోలీ ఆడబోతుంటే.. మీ మొబైల్ చుట్టూ ప్లాస్టిక్ షీట్ చుట్టేయండి. దానిపై టేప్ వేయవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ మొబైల్‌పై కలర్ లేదా వాటర్ పడితే అది పాడైపోకుండా కాపాడుకోవచ్చు. మొబైల్‌పై నేరుగా టేప్‌ను అతికించవద్దనని గుర్తుంచుకోండి. ముందుగా ఒక షీట్‌ను చుట్టండి. ఆ తర్వాత మాత్రమే దానిపై టేప్‌ను వేయండి.
హోలీ రోజున ఒకరికొకరు ఫోన్ చేసి లేదా మెసేజ్‌లు పంపించుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో మీ ఫోన్‌లో బ్లూటూత్ లేదా ఇయర్‌ఫోన్‌ను సెట్ చేయండి. మీరు ఇయర్‌ఫోన్‌లు ధరిస్తే.. మీ మెడలో వేలాడేసుకోవచ్చు. మీరు మొబైల్‌ను పదే పదే బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. తద్వారా రంగులు, నీటి నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు.
హోలీ ఆడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో మీ మొబైల్‌ను ఇంట్లోనే ఉంచవచ్చు. ఒకవేళ అనుకోకుండా మీ మొబైల్‌ను మీతో తీసుకెళ్లితే.. మీరు హోలీ ఆడుతున్నప్పుడు సురక్షితమైన ప్రదేశంలో ఉంచుకోవచ్చు. మీతో ఒక బ్యాగ్‌ను తీసుకెళ్లి మీ మొబైల్‌ను అందులో ఉంచుకోవచ్చు, తద్వారా రంగులు. నీటి నుంచి మీ మొబైల్ సురక్షితంగా ఉంచుకోవచ్చు.