Post Office FD Scheme : పోస్టాఫీస్ ఎఫ్‌డీతో అద్భుతమైన బెనిఫిట్స్.. 5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మీకు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది!

Post Office FD Scheme : పోస్టాఫీసులో 5 ఏళ్ల ఎఫ్‌డీ డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బును మూడు రెట్లు పెంచుకోవచ్చు. ఇందుకోసం మీ ఎఫ్‌‌డీని రెండుసార్లు పొడిగించాల్సి ఉంటుంది. ఇంకా ఏమి చేయాలంటే?

Post Office FD Scheme : పోస్టాఫీస్ ఎఫ్‌డీతో అద్భుతమైన బెనిఫిట్స్.. 5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మీకు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది!

How Post Office fixed deposit double

Updated On : March 11, 2025 / 5:04 PM IST

Post Office FD Scheme : పోస్టాఫీసులో ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. పోస్టాఫీసులో డబ్బు పెట్టుబడి విషయానికి వస్తే.. చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఎఫ్‌డీలో డబ్బు పెట్టుబడి పెట్టడమే.

Read Also : Summer AC Offers : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీలపై 50 శాతం డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఏసీని కొని ఇంటికి తెచ్చుకోండి!

ఇందులో మీ డబ్బు పెట్టుబడి పెట్టేందుకు ఎఫ్‌డీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో వచ్చే రాబడి స్థిరంగా ఉంటుంది. అలాగే, ఎఫ్‌డీలో డబ్బు పోతుందనే భయం లేదు. మీరు కూడా మీ డబ్బును ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మీరు ఆ డబ్బును బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టవచ్చు.

పోస్టాఫీస్ ఎఫ్‌డీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాఫీసులో మీరు ఒక ఏడాది నుంచి 5 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు చాలా మంచి వడ్డీ రేటుతో రాబడిని పొందుతారు. మరోవైపు, మీరు 5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెడితే.. మీ డబ్బును 3 రెట్లు పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మీ డబ్బు 3 రెట్లు పెరగాలంటే? :
పోస్టాఫీసులో 5 ఏళ్లలో ఎఫ్‌డీ డబ్బు పెట్టుబడి పెట్టేందుకు బెస్ట్ ఆప్షన్. ఈ FDలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బును మూడు రెట్లు పెంచుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ FDని రెండుసార్లు పొడిగించాల్సి ఉంటుంది.

అంటే.. మీరు 15 ఏళ్ల పాటు FDలో పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. పోస్టాఫీస్ ఎఫ్‌‌డీపై 5 ఏళ్ల పాటు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 5 ఏళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీ రేటుతో రూ. 2,24,974 వడ్డీ వస్తుంది. అంటే.. మీకు మొత్తం రూ. 7,24,974 జమ ఉంటుంది.

Read Also : iQOO Z10 Series : ఏప్రిల్‌లో ఐక్యూ Z10 సిరిస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఓసారి లుక్కేయండి!

ఇప్పుడు మీరు మరో 5 ఏళ్లు పెట్టుబడిని పొడిగించాలి. ఆ తర్వాత మీకు వడ్డీగా రూ. 3,26,201 వస్తుంది. అప్పుడు మీ దగ్గర రూ. 10,51,175 ఉంటాయి. ఇప్పుడు మీరు మరోసారి మీ పెట్టుబడిని పొడిగించాలి. ఆ తర్వాత మీకు వడ్డీగా రూ. 4,72,974 వస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీకు మొత్తం రూ. 15,24,149 రాబడి వస్తుంది. ఈ విధంగా, మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బును మూడు రెట్లు పెంచుకోవచ్చు అనమాట.