Airtel Weekend Data : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. రూ.59కే వీకెండ్ డేటా రోల్ ఓవర్ ప్లాన్.. మిగిలిన డేటాను వాడేసుకోవచ్చు!
Airtel Weekend Data : ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.59 వారాంతపు డేటా రోల్‌ఓవర్ ప్యాక్‌ను అందిస్తోంది. వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ద్వారా రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు వారంలో మిగిలిన డేటాను వాడుకోవచ్చు.

Airtel Weekend Data
Airtel Weekend Data : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం డేటా రోల్‌ఓవర్ బెనిఫిట్స్‌తో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఒక నివేదిక వెల్లడించింది. వీకెండ్ రోల్‌ఓవర్ డేటా ప్యాక్‌గా పిలుస్తారు. వారం రోజుల్లో వాడని మొబైల్ డేటాను మరో వారంలో వాడుకోవచ్చు.
ప్రస్తుతం టెలికాం ప్రొవైడర్ హర్యానా, నార్త్-ఈస్ట్ సర్కిల్‌లలో ఉన్న ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో కూడా అందుబాటులోకి రానుంది. ఈ వీకెండ్ రోల్ ఓవర్ డేటా యాక్టివ్ కోసం 28 రోజుల వ్యాలిడిటీ ఉండాలి. అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ డేటా బెనిఫిట్స్ బేస్ ప్లాన్ తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలి.
వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ప్యాక్ బెనిఫిట్స్ ఇవే :
టెలికామ్‌టాక్ నివేదిక ప్రకారం.. కొత్త వీకెండ్ రోల్‌ఓవర్ ప్యాక్ ధర రూ. 59కు ఆఫర్ చేస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉపయోగించని మొబైల్ డేటా సేవ్ చేయొచ్చు. శనివారం, ఆదివారం నాటికి ఇదే డేటా యాడ్ అవుతుంది. యాడ్-ఆన్ ప్లాన్‌గా డేటాను వాడుకోవచ్చు. మీరు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు అయి ఉండాలి. అన్‌లిమిటెడ్ వాయిస్, రోజువారీ డేటా బెనిఫిట్స్‌తో కూడిన బేస్ ప్యాక్‌ను యాక్టివ్‌గా కలిగి ఉండాలి.
ఉదాహరణకు.. రోజుకు 2GB డేటా కలిగి ఉంటే.. రోజుకు 1GB డేటాను మాత్రమే ఉపయోగించే కస్టమర్లకు మిగిలిన డేటాను క్యారీ ఓవర్ చేసి వారాంతపు డేటా బ్యాలెన్స్‌ను పొందవచ్చు. అలా యాడ్ చేసిన డేటాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వీడియో కాల్స్ లేదా కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు ఉపయోగించవచ్చని ఎయిర్‌టెల్ చెబుతోంది.
డేటా లిమిట్ అయిపోయిన తర్వాత స్పీడ్ 64Kbpsకి తగ్గుతుందని టెలికాం ప్రొవైడర్ తెలిపింది. భారత టెలికం మార్కెట్లో ఎయిర్‌టెల్ వీకెండ్ రోల్‌ఓవర్ బెనిఫిట్స్ అందించే మరో టెలికాం ప్రొవైడర్‌గా అవతరించింది. ముఖ్యంగా, ఇలాంటి సర్వీసులను ఇప్పటికే వోడాఫోన్ ఐడియా ( Vi ) అందిస్తోంది. అదేవిధంగా, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్‌లతో నెలవారీ డేటా రోల్‌ఓవర్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్యాక్ :
ఎయిర్‌టెల్ ఇటీవలే కొత్త రూ.160 క్రికెట్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 7 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటా, 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. డేటా కోటా ముగిసిన తర్వాత డేటా వినియోగానికి ప్రతి 1MBకి 50 పైసలు ఛార్జ్ అవుతుంది.
ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో ఆపిల్ సబ్‌స్క్రిప్షన్ :
ఇటీవలే ఆపిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తద్వారా ఆపిల్ టీవీ+ హోం వై-ఫై, పోస్ట్‌పెయిడ్ యూజర్లు యాక్సెస్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యూజర్లు, పోస్ట్‌పెయిడ్ మొబైల్ యూజర్లు రూ. 999 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.
దాంతో స్ట్రీమింగ్ సర్వీస్ కంటెంట్ లైబ్రరీని కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇంకా, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ యూజర్లు ఆపిల్ టీవీ+ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఆపిల్ మ్యూజిక్‌కు 6 నెలల ఫ్రీ యాక్సెస్‌ను కూడా పొందవచ్చు.