మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అక్టోబర్ 1 నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)లో కొత్త ఛార్జీలు, పెనాల్టీలు అమల్లోకి వచ్చేశాయి.
మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అక్టోబర్ 1 నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)లో కొత్త ఛార్జీలు, పెనాల్టీలు అమల్లోకి వచ్చేశాయి. ఎస్బీఐ లావాదేవీలతో పాటు కనీస నగదు జమ (AMB), ఎస్బీఐ బ్రాంచుల ఏటీఎంల్లో విత్ డ్రా చేయడం, క్యాష్ డిపాజిట్ లావాదేవీలపై ఫీజులు, సర్వీసుల ఛార్జీలను సవరించినట్టు ఇటీవల ఎస్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ కొత్త సర్వీసు ఛార్జీలు, పెనాల్టీలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేశాయి. అందిన రిపోర్టు ప్రకారం.. క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్ డ్రాలను అధిగమించిన కస్టమర్లకు బ్యాంకు ఛార్జీలు, పెనాల్టీలు విధిస్తుంది. ఈ విషయంలో ఎస్బీఐ బ్యాంకు మెట్రో, సెమీ-అర్బన్, గ్రామీణ బ్రాంచులును మొత్తం మూడు కేటగిరీలుగా విభజించింది.
బ్యాంకు మంజూరు చేసే రుణాలపై కూడా అదనపు బెంజ్ మార్క్ కు రెపో రేటును ఆమోదించింది. అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ నెలలో 8 నుంచి 10 వరకు ఉచిత ఏటీఎం లావాదేవీలకు అనుమతి ఇస్తుంది. కస్టమర్ల సేవింగ్స్ అకౌంట్లపై నెలవారీ సగటు కనీస నగదు జమ రూ.25వేల వరకు అనుమతి ఇచ్చింది.
ఆపైనా అకౌంట్లలో నగదు జమ చేసిన కస్టమర్లకు ఎస్బీఐ ఏటీఎంల్లో అన్ లిమిటెడ్ లావాదేవీలకు అనుమతి ఇచ్చింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మెట్రో సిటీల్లో మూడు, ఇతర నగరాలు, టౌన్లలోని ఏటీఎంల్లో 5 లావాదేవీలకు మాత్రమే ఉచిత లావాదేవీ పరిమితికి ఎస్బీఐ కస్టమర్లందరికి అనుమతి ఇస్తోంది.
ఈ ఉచిత లావాదేవీ పరిమితిని ఎవరైతే అధిగమిస్తారో ఆయా కస్టమర్లకు జీఎస్టీతో కలిపి రూ.5 నుంచి రూ.20కు పైగా సర్వీసు ఛార్జ్ విధించనుంది. ఏటీఎంల్లో కార్డ్ లెస్ లావాదేవీలపై జీఎస్టీతో కలిపి రూ.22లకు పైగా ఛార్జ్ చేయనుంది. ఎస్బీఐ శాలరీ ఖాతాదారులకు మాత్రం ఊరట నిచ్చింది. అన్ని ఏటీఎంల్లో అన్ లిమిటెడ్ ఫ్రీ ట్రాన్స్ జెక్షన్ చేసుకునే సదుపాయాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
బ్రాంచుల్లో NEFT లావాదేవీలు :
* రూ. 10వేల వరకు – రూ.2 + జీఎస్టీ
* రూ.10వేలు పైనా – రూ.లక్ష వరకు రూ.4 +జీఎస్టీ
* రూ.లక్ష పైనా, రూ.2 లక్షల వరకు – రూ.12+జీఎస్టీ
* రూ.2 లక్షలు పైనా – రూ.20+జీఎస్టీ
బ్రాంచుల్లో RTGS లావాదేవీలు :
* రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు : రూ.20కు పైగా జీఎస్టీ అదనం.
* రూ. 5 లక్షలకు పైగా.. రూ.40కు పైగా జీఎస్టీ అదనం.
* రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు – రూ.20 + జీఎస్టీ
* రూ.5 లక్షలు అవతల.. రూ.40+జీఎస్టీ