PM Narendra Modi inaugurates Bharat Mobility Global Expo
Auto Expo 2025 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 రెండో ఎడిషన్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం (జనవరి 17) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించారు. ఈ ఆటో ఎగ్జిబిషన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు 100 కన్నా ఎక్కువ కొత్త వాహనాలు, స్పేర్ పార్టులు, టెక్నికల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆటో ఎక్స్‌పో వాహనాల ప్రదర్శన జనవరి 22 వరకు కొనసాగుతుంది.
Read Also : Auto Expo 2025 : త్వరలో కొత్త ఇ-యాక్సెస్ స్కూటర్ ఆవిష్కరణ.. భారత్‌లో సుజుకీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్!
ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా పలు రవాణా రంగ సంస్థలు పాల్గొంటాయి. ఇందులో వివిధ రకాల వాహనాలతో పాటు వాహనాలకు సంబంధించిన అన్నీ మోడల్స్ ఒకేచోట ప్రదర్శించనున్నారు. వాహన తయారీదారులతో పాటు, కాంపోనెంట్, ఎలక్ట్రానిక్ పరికరాలు, టైర్, ఎనర్జీ స్టోరేజ్ తయారీదారులు, వాహన సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉత్పత్తులు ఈ ఆటో ఎక్స్‌పోలో కనిపిస్తాయి.
ఢిల్లీలో 2 వేదికలు.. గ్రేటర్ నోయిడాలో ఒక వేదిక :
ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పో మొత్తం 3 వేదికలపై జరుగుతోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం, ద్వారకలోని యశోభూమి, ఇండియా ఎక్స్‌పో సెంటర్, గ్రేటర్ నోయిడాలోని మార్ట్‌లలో ఆటో ఎక్స్‌పో కొనసాగనుంది. దాదాపు రెండు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ఆటోమోటివ్, మొబిలిటీ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పో ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హెచ్‌డి కుమారస్వామి, జితన్ రామ్ మాంఝీ, మనోహర్ లాల్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరీలతో పాటు ఆటోమొబైల్ రంగాల నేతలు హాజరయ్యారు.
PM Narendra Modi Bharat Mobility Global Expo
ఏ రోజు ఎవరికి ప్రవేశం ఉంటుందంటే? :
ఈ ఆటో ఎక్స్‌పో ప్రదర్శనలో మొదటి రోజు మీడియా, రెండో రోజు వ్యాపారవేత్తల కోసం ఉంచారు. ఆదివారం (జనవరి 19) నుంచి సామాన్యులు వెళ్లవచ్చు. జనవరి 22 వరకు జరగనున్న ఈ ఆటో ఎక్స్‌పో ఈవెంట్ ఫ్యూచర్ మొబిలిటీకి కూడా వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇందులో 5 లక్షల మందికి పైగా పాల్గొననున్నారు. ఈ ఎక్స్‌పో థీమ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
ఆటోమోటివ్, మొబిలిటీ రంగంలో సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ విధానం లక్ష్యం. స్థిరమైన, అత్యాధునిక సాంకేతిక పురోగమనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మూడు చోట్ల నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం, ద్వారకలోని యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్, మార్ట్ 9 కన్నా ఎక్కువగా ఏకకాలంలో ప్రదర్శనలు ఉంటాయి. ప్రతి ఒక్కటి మొబిలిటీ ఎకోసిస్టమ్ విభిన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. ఈసారి ప్రదర్శన ప్రాంతం 2024 కన్నా రెట్టింపుగా ఉంటుంది. రెండు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయగా, 5,100 మందికి పైగా విదేశీ పార్టిసిపెంట్లు కూడా పాల్గొంటారు.
గ్లోబల్ ఎక్స్‌పోలో సామాన్యులకు ఉచిత ప్రవేశం :
ఆదివారం నాడు సామాన్యులకు ఈ ప్రదర్శన ఉచితంగా అనుమతిస్తారు. సందర్శకులు భారత్ మండపాన్ని రెండు ప్రవేశాల ద్వారా అనుమతిస్తారు. సౌలభ్యం కోసం రెండు ప్రత్యేక ఎగ్జిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మోటార్ షో ఆదివారం నుంచి జనవరి 22 వరకు సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. క్లోక్‌రూమ్ అందుబాటులో లేనందున సందర్శకులు పెద్ద హ్యాండ్‌బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేస్‌లు, బిగ్ లేడీస్ హ్యాండ్‌బ్యాగ్‌లు, బ్యాక్‌ప్యాక్‌లు, ప్యాకెట్లు వంటి వాటిని తీసుకురావద్దని నిర్వాహకులు సూచించారు.
Read Also : Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోలో కొత్త BMW X3 లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?