Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోలో కొత్త BMW X3 లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Auto Expo 2025 : కొత్త బీఎండబ్ల్యూ X3 కారు సరికొత్త డిజైన్, ఫీచర్లు ఫంక్షనాలిటీలో వస్తోంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది.

Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోలో కొత్త BMW X3 లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Bharat Mobility Global Expo 2025

Updated On : January 17, 2025 / 3:45 PM IST

Auto Expo 2025 : కొత్త కారు కోసం చూస్తున్నారా? ప్రముఖ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా కొత్త ఎక్స్3ని లాంచ్ చేస్తోంది. ఈరోజు (జనవరి 17) నుంచి న్యూఢిల్లీలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనుంది. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్‌లు, హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లతో ఆకర్షణీయమైన లైనప్‌ను ప్రదర్శిస్తుంది. కంపెనీ ఆల్-ఎలక్ట్రిక్ BMW i7, BMW X7, BMW 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, BMW M5, BMW M4, BMW M2 మోడల్ కార్లను ప్రదర్శిస్తుంది.

Read Also : Auto Expo 2025 Tickets : ఈ నెల 17 నుంచే ఆటో ఎక్స్‌పో 2025 ప్రారంభం.. ఎలా చేరుకోవాలి? ఫ్రీగా టికెట్లు ఎలా పొందాలంటే?

కొత్త బీఎండబ్ల్యూ X3 కారు సరికొత్త డిజైన్, ఫీచర్లు ఫంక్షనాలిటీలో వస్తోంది. స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (SAV) మాదిరిగా ఫోర్త్ జనరేషన్ X3 రోజువారీ వినియోగానికి సౌకర్యంగా ఉంటుంది. లోపల క్యాబిన్‌లో ప్రీమియం మెటీరియల్స్, అప్‌డేట్ చేసిన డిజిటల్ ఇంటర్‌ఫేస్, లేటెస్ట్ బీఎండబ్ల్యూ (iDrive) సిస్టమ్, బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 9, క్విక్‌సెలెక్ట్ ద్వారా అందిస్తుంది. ఎక్స్‌ట్రనల్ డిజైన్, మరింత ఆధునిక, డైనమిక్ డిజైన్ అందిస్తుంది.

Bharat Mobility Global Expo 2025

Bharat Mobility Global Expo 2025

బీఎండబ్ల్యూ (BMW) పరిభాషలో ‘ఐకానిక్ గ్లో’ అని పిలిచే సరౌండ్‌తో వస్తుంది. ఈ కారు XM మోడల్ నుంచి ప్రేరణ పొందిన ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. గ్రిల్ ప్రత్యేక నమూనా, వర్టికల్, వికర్ణ రేఖలతో వాహనం అంతటా విస్తరించి ఉంటుంది. బ్యాక్ సైడ్ సహా, ప్రత్యేకించి ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్న ప్రాంతంలో ఉంటుంది.

తద్వారా వైర్‌లెస్ ఛార్జింగ్ ట్రేలకు బ్యాక్‌డ్రాప్‌గా కూడా పనిచేస్తుంది. ఫోన్ బయటకు కనిపించేలా ఇంక్లైన్‌తో రూపొందించి ఉంటుంది. అడాప్టివ్ ఎల్ఈడీ లైట్లు ట్విన్ ఎల్-ఆకారపు డీఆర్ఎల్ ద్వారా రూపొందించారు. టెయిల్ లైట్ సిగ్నేచర్‌, ఫ్రంట్ సైడ్ సమాంతరంగా బ్యాక్ సైడ్ లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది.

కొత్త బీఎండబ్ల్యూ X3 కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు. పెట్రోల్ వెర్షన్ 208hp, 330Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో వస్తుంది. అయితే, డీజిల్ వేరియంట్ 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో 197hp, 400Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.

Read Also : Auto Expo 2025 : త్వరలో కొత్త ఇ-యాక్సెస్ స్కూటర్ ఆవిష్కరణ.. భారత్‌లో సుజుకీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్!