ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్లు ఇవే.. ఎగబడి కొంటున్న జనం

గత ఆర్థిక ఏడాదిలో వాగన్‌ఆర్ దాన్ని అధిగమించి, టాప్‌ ప్లేస్‌లోకి వచ్చింది.

Indian passenger vehicle sales: భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఏదో తెలుసా? మారుతి సుజుకి వాగన్‌ఆర్‌. ఈ కారు 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజెర్ వెహికిల్‌గా నిలిచింది.

అయితే, 2024 క్యాలెండర్ ఇయర్‌ పరంగా చూసుకుంటే టాటా పంచ్ అమ్మకాలలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు గత ఆర్థిక ఏడాది పరంగా వాగన్‌ఆర్ దాన్ని అధిగమించి, టాప్‌ ప్లేస్‌లోకి వచ్చింది. 2024-25 ఆర్థిక ఏడాది మారుతి సుజుకి వాగన్‌ఆర్‌ 1,98,451 కార్లను అమ్మింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో విక్రయించిన కార్ల కంటే ఈ సంఖ్య తక్కువే. అదే 2023-24 ఆర్థిక ఏడాదిలో మారుతి సుజుకి వాగన్‌ఆర్‌ 2,00,177 యూనిట్లు విక్రయించింది.

అలాగే, దేశంలో తక్కువ ధరకు లభ్యమవుతున్న మారుతి సుజుకి ఆల్టో కే 10.. 2024-25 ఆర్థిక ఏడాదిలో మొత్తం 1,02,232 యూనిట్లు అమ్ముడుపోయింది. ఆ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్స్‌ వెహికిల్స్‌లో ఈ కారు 15వ స్థానంలో ఉంది.

గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ప్యాసింజర్స్‌ వెహికిల్స్‌లో ఏడు మారుతి సుజుకి లైనప్ నుంచే ఉన్నాయి.

ఇక టాటా పిప్స్ మహీంద్రా గత ఆర్థిక ఏడాది ప్యాసింజర్స్‌ వెహికిల్స్‌లో అమ్మకాలలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఎలక్ట్రిక్ కార్లలో పంచ్ ఈవీ బెస్ట్‌సెల్లింగ్‌ కారుగా నిలిచింది.

టాటా మోటార్స్ గత ఆర్థిక ఏడాదిలో మొత్తం 5,56,263 ప్యాసింజర్స్‌ వెహికిల్స్‌ను (దేశీయ అమ్మకాలు, ఎగుమతులతో సహా) విక్రయించింది. 2023-2024 ఆర్థిక ఏడాదిలో అమ్మిన కార్ల (573,495 యూనిట్లు) కంటే గత ఏడాది విక్రయించిన కార్ల సంఖ్య తక్కువే.

అయినప్పటికీ గత ఆర్థిక ఏడాదిలో మహీంద్రా అండ్ మహీంద్రా కంటే టాటా మోటార్స్ ఎక్కువ కార్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5,51,487 వాహనాలను అమ్మింది.

ఈ కార్లు వచ్చేస్తున్నాయ్..
మరోవైపు, సిట్రోయెన్ ఇండియా ఇటీవల సిట్రోయెన్ సీ3, సిట్రోయెన్ బసాల్ట్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ల టీజర్‌ను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ‘డార్క్ ఎడిషన్’ పేరిట అప్‌లోడ్ చేసింది. సిట్రోయెన్ ఎస్‌యూవీ త్రయం త్వరలో భారత మార్కెట్లలో డార్క్‌ థీమ్‌తో రానుంది.