Ayushman Card : ఆయుష్మాన్ హెల్త్ కార్డు.. 70ఏళ్లు పైబడితే అప్లయ్ చేయొచ్చు.. రూ. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్..!

Ayushman Card : ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ కోసం అప్లయ్ చేశారా? 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ పథకానికి అర్హులు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు.

Ayushman Card

Ayushman Card : 70ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులను అందిస్తోంది. ఆరోగ్య బీమా ద్వారా సీనియర్ సిటిజన్లు ఏడాదికి రూ. 5 లక్షల విలువైన ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)లో భాగంగా ఆయుష్మాన్ వే వందన కార్డును పొందవచ్చు. ఈ ఆయుష్మాన్ యాప్ ద్వారా నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు.

Read Also :  iQOO Neo 10 : ఐక్యూ నియో 10 వచ్చేసింది.. కెమెరా ఫీచర్లు కేక.. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?

ఆయుష్మాన్ వే వందన కార్డ్ ఏంటి? :
ఆయుష్మాన్ వే ​​వందన కార్డ్ అనేది ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు కార్డు. దేశమంతటా ఎంప్యానెల్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.

2018లో పీఎం నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. 55 కోట్లకు పైగా ప్రజలలో దాదాపు 40 శాతం కవర్ చేస్తుంది. అక్టోబర్ 29, 2024 నుంచి ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ ఈ పథకానికి అర్హులే.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మొత్తం 65,97,096 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 64,96,101 దరఖాస్తులు ఇప్పటికే అప్రూవల్ పొందాయి. 96,203 పెండింగ్‌లో ఉండగా, మొత్తం 4,792 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల రిజెక్ట్ అయ్యాయి.

మొత్తం 434 కార్డులు పంపిణీ అయ్యాయి. అత్యధిక దరఖాస్తులు వచ్చిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? :
ఏ భారతీయ పౌరుడైనా
70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే
వ్యాలీడ్ ఆధార్ కార్డు ఉండాలి

అవసరమైన డ్యాకుమెంట్లు ఇవే :
ఆధార్ కార్డు (వయస్సు, ఐడెంటిటీ ప్రూఫ్)
ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్

ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
మీరు రెండు సులభమైన మార్గాల ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి మొబైల్ యాప్ ద్వారా రెండోది అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొబైల్ యాప్ ద్వారా అప్లయ్ ఎలా? :

  • ఆయుష్మాన్ యాప్ (మొబైల్ మెథడ్) ద్వారా అప్లయ్ చేసుకోండి.
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • యాప్ ఓపెన్ చేసి లబ్ధిదారుడిగా లాగిన్ అవ్వండి.
  • మీ మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి. ఆపై OTP వెరిఫై చేయండి.
  • ’70+ రిజిస్టర్’ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆధార్ వివరాలను ఎంటర్ చేయండి. e-KYC పూర్తి చేయండి.
  • అవసరమైన వివరాలను నింపండి.
  • లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేయండి.
  • ఫారమ్‌ను సమర్పించండి.
  • మీ ఆయుష్మాన్ కార్డ్ నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేయండి :

  • ఆయుష్మాన్ భారత్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.
  • OTP ద్వారా లాగిన్ అవ్వండి.
  • ‘సీనియర్ సిటిజన్ల రిజిస్టర్ (70+)’ బ్యానర్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి
  • OTP/బయోమెట్రిక్స్ ద్వారా e-KYC పూర్తి చేయండి.
  • మీ వివరాలను సమర్పించి Agree ఆప్షన్ క్లిక్ చేయండి.
  • లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేయండి. ఫారమ్‌ను సమర్పించండి.
  • కార్డ్ 15నుంచి 20 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హెల్ప్ పొందాలంటే? :
దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి.

  • 14555
  • 1800-11-0770 కెనడియన్ డాక్యుమెంటరీ సెక్షన్
  • భారత్ అంతటా 24×7 సర్వీసు అందుబాటులో ఉంది.

ఎందుకు దరఖాస్తు చేయాలి? :
ఈ ఆయుష్మాన్ కార్డు ద్వారా లక్షలాది మెడికల్ బిల్స్ ఆదా అవుతాయి. హార్ట్ సర్జరీ, డయాలసిస్, క్యాన్సర్ ట్రీట్‌మెంట్ వంటివి ఈ (PMJAY)లో రిజిసర్ట్ చేసుకోవచ్చు. తద్వారా సీనియర్ సిటిజన్లు ఆర్థిక ఇబ్బంది లేకుండా సకాలంలో చికిత్స తీసుకోవచ్చు.

Read Also : M2 MacBook Air : ఫ్లిప్‌కార్ట్‌ అదిరే ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ M2 మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్.. డోంట్ మిస్!

ఇప్పటివరకు అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, పరిమిత కార్డులను పంపిణీ చేస్తున్నారు. ముందుగానే అప్లయ్ చేయడం ద్వారా కవరేజీని పొందడానికి వీలుంటుంది.