2023 Bajaj Chetak Launch _ Bajaj auto launches New 2023 Chetak premium Electric Scooter Price, Specifications
2023 Bajaj Chetak Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ చేతక్ (Bajaj Chetak 2023 ) ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 మోడల్ ఎడిషన్ ప్రవేశపెట్టింది. ఈ చేతక్ ప్రీమియం 2023 ఎడిషన్ కొత్త రేంజ్-టాపింగ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈవీ స్కూటర్ ధర రూ. 1,51,958 లక్షలు (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీలో రూ. 1.52లక్షలు )గా ఉంది. సరికొత్త వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ వెర్షన్‌పై రూ. 29,535 ప్రీమియంతో సేల్‌కు అందుబాటులో ఉంది. కొత్త 2023 చెతక్ ప్రీమియం మూడు కొత్త కలర్ పెయింట్ (మాట్ కరేబియన్ బ్లూ, మ్యాట్ కోర్స్ గ్రే, శాటిన్ బ్లాక్) స్కీమ్‌లలో వచ్చింది.
స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే.. పెద్ద కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రూపంలో సరికొత్త ఫీచర్‌ని అందిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఇతర ఫీచర్లలో రెండు-టోన్డ్ సీట్, బాడీ-కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్‌లు ఉన్నాయి. హెడ్‌ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు, సెంట్రల్ ట్రిమ్ ఎలిమెంట్‌లు చార్‌కోల్ బ్లాక్‌లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ARAI- వెరిఫైడ్ రేంజ్ కలిగి ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 108 కిమీల పరిధిని కలిగి ఉంది. వాస్తవానికి ఈ చెతక్ స్కూటర్ వేగం పరిధి 90 కిమీ వరకు ఉంటుందని బజాజ్ పేర్కొంది.
2023 Bajaj Chetak Launch _ Bajaj auto launches New 2023 Chetak premium Electric Scooter
ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని తెలిపింది. అంటే.. 0 – 80శాతం ఛార్జ్ 2.75 గంటల్లో పూర్తి అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదని గమనించాలి. ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 4.2 kW పవర్ అవుట్‌పుట్, 20 Nm గరిష్ట టార్క్ రేటింగ్‌ను కలిగి ఉంది.
బజాజ్ చెతక్ ప్రీమియం 2023 ఎడిషన్ 63 kmph గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ ఇప్పుడు 60కిపైగా నగరాల్లో అందుబాటులో ఉంది. మార్చి 2023 నాటికి ఈ సంఖ్య 85 నగరాలకు పెరుగుతుందని బజాజ్ తెలిపింది. 2023 చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం రూ.2వేలు చెల్లించి ఈ చెతక్ ఈవీ స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.