Bank Holiday Dec 6 : డిసెంబర్ 6న బ్యాంకులకు సెలవు ఉందా? శనివారం తెరిచే ఉంటాయా? లేదా? హాలిడే ఫుల్ లిస్ట్ చెక్ చేయండి!

Bank Holiday : డిసెంబర్ 6న శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయో లేదా? సెలవు ఉందా? ఆర్బీఐ సెలవుల జాబితాలో అసలు సెలవు ప్రకటించిందా? లేదో ఇప్పుడు చూద్దాం..

Bank Holiday Dec 6 : డిసెంబర్ 6న బ్యాంకులకు సెలవు ఉందా? శనివారం తెరిచే ఉంటాయా? లేదా? హాలిడే ఫుల్ లిస్ట్ చెక్ చేయండి!

Bank Holiday Dec 6

Updated On : December 5, 2025 / 7:58 PM IST

Bank Holiday : మీరు బ్యాంకుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? డిసెంబర్ 6న శనివారం బ్యాంకులో పని ఉందా? అయితే ఇది మీకోసమే.. సాధారణంగా శని, ఆదివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అందుకే శనివారాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా అనే దానిపై చాలా మంది గందరగోళం చెందుతున్నారు. ఏ నెలలోనైనా మొదటి శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఈ నెలలో డిసెంబర్ 6న మొదటి శనివారం. అంటే.. బ్యాంకులు పనిచేస్తాయి.. ఎలాంటి సెలవు లేదు.

ఆర్బీఐ బ్యాంకు హాలిడే క్యాలెండర్,  (Bank Holiday) నిబంధనల ప్రకారం.. అన్ని బ్యాంకులు రెండో, నాల్గవ శనివారాల్లో మూతపడతాయి. మిగిలిన అన్ని శనివారాల్లో అంటే.. మొదటి, మూడో, ఐదో శనివారాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. డిసెంబర్ 2025లో బ్యాంకులు ఎప్పుడు, ఎక్కడ పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం..

డిసెంబర్ 1 (సోమవారం) :
స్థాపన దినోత్సవం స్వదేశీ విశ్వాస దినోత్సవం రోజున అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 3 (బుధవారం) :
సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వర్ధంతి సందర్భంగా గోవాలో బ్యాంకులు పనిచేయవు.

ఇప్పుడు బ్యాంకులు డిసెంబర్ 7వ తేదీ ఆదివారం, వారాంతపు సెలవు దినం
డిసెంబర్ 7 : ఆదివారం (బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 12 (శుక్రవారం) :
గారో కమ్యూనిటీకి చెందిన ధైర్య స్వాతంత్ర్య సమరయోధుడు పా టోగన్ నెంగ్మింజా సంగ్మా బలిదానం రోజున మేఘాలయలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 13 – రెండో శనివారం (బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 14 : ఆదివారం (బ్యాంకులకు సెలవు)

Read Also : 2026 Holidays List: పండగే పండగ.. 2026లో ప్రభుత్వ సెలవులు ఇవే.. లిస్ట్ విడుదల చేసిన ఏపీ సర్కార్..

డిసెంబర్ 18 (గురువారం) :
ఖాసీ కవి యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు పనిచేయవు.

డిసెంబర్ 19 (శుక్రవారం) :
గోవా విమోచన దినోత్సవం రోజున గోవాలో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి.

డిసెంబర్ 20 (శనివారం) :
లోసూంగ్, నామ్సంగ్ పండుగ రోజున సిక్కింలో బ్యాంకులు మూతపడతాయి.

డిసెంబర్ 21 : ఆదివారం (బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 22 (సోమవారం) :
లోసూంగ్, నామ్సంగ్ పండుగ రోజున సిక్కింలో బ్యాంకులు పనిచేయవు.

డిసెంబర్ 24 (బుధవారం) :
నాగాలాండ్, మేఘాలయ, మిజోరాంలలో క్రిస్మస్ ఈవ్ సందర్భంగా బ్యాంకులకు సెలవులు.

డిసెంబర్ 25 (గురువారం) :
క్రిస్మస్ నాడు దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.

డిసెంబర్ 26 (శుక్రవారం) :
ఈ 3 ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్మస్ తర్వాత కూడా బ్యాంకులు వరుసగా 4 రోజులు మూతపడతాయి.

డిసెంబర్ 27 : నాల్గవ శనివారం (బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 28 : ఆదివారం (బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 30 (మంగళవారం) :
స్వాతంత్ర్య సమరయోధుడు యు క్యాంగ్ నంగ్బా వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 31 (బుధవారం) :
నూతన సంవత్సర వేడుకలు, ఇమోయిను ఇరత్ప పండుగ రోజున మిజోరం, మణిపూర్‌లలో బ్యాంకులు పనిచేయవు.