Bank Holidays in January : తెలుగు రాష్ట్రాల్లో జనవరి 1న బ్యాంకులకు సెలవా? లేదంటే పని చేస్తాయా..?

కొత్త సంవ‌త్స‌రం కావ‌డంతో జ‌న‌వ‌రి 1న బ్యాంక్ హాలిడే ఉంటుందా..? లేదంటే ప‌ని చేస్తాయా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది.

Bank Holiday On January 1st In Telugu States Or Will It Work

Bank Holidays : చ‌రిత్ర‌లో మ‌రో సంవ‌త్స‌రం క‌లిసిపోతుంది. ప్ర‌పంచం మొత్తం కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికేందుకు సిద్ధ‌మైంది. కాగా.. గతంతో పోల్చుకుంటే మ‌న దేశంలో దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికి బ్యాంకు ఖాతా ఉంది. చాలా సంద‌ర్భాల్లో డిజిట‌ల్ చెల్లింపులు చేస్తున్న‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు బ్యాంకుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంటోంది. అయితే.. బ్యాంకుల‌కు వెళ్లినప్పుడు అవి మూసి ఉన్నాయ‌ని అనుకోండి అప్పుడు మ‌నం సమ‌యం వృథా కాక‌మాన‌దు అంతేకాకుండా చేయాల్సిన ప‌ని కూడా పెండింగ్‌లో ప‌డుతుంది. అలా కాకుండా ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెల‌వులు ఉంటాయో తెలుసుకుని ముంద‌స్తుగా ప్లాన్ చేసుకుంటే స‌మయం ఆదా కావ‌డంతో పాటు ప‌ని కూడా పూర్తి అవుతుంది.

కొత్త సంవ‌త్స‌రం కావ‌డంతో జ‌న‌వ‌రి 1న బ్యాంక్ హాలిడే ఉంటుందా..? లేదంటే ప‌ని చేస్తాయా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కాగా.. చాలా మంది జ‌న‌వ‌రి 1న హాలీడే ఉంటుంద‌ని, బ్యాంకులు ప‌ని చేయ‌వ‌ని భావిస్తుంటారు. అయితే.. ఇవి కేవ‌లం అపోహ మాత్ర‌మే. ఎందుకంటే బ్యాంకుల‌కు సెల‌వు అనేది రాష్ట్రం ప్రాతిప‌దిక‌న మారుతూ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. జ‌న‌వ‌రి 1న బ్యాంకుల‌కు ఎటువంటి సెల‌వు లేదు.

NPCI UPI ID : ఇలాంటి యూపీఐ ఐడీలను డిసెంబర్ 31లోపు డియాక్టివేట్ చేయాలి.. ఎన్‌పీసీఐ ఆదేశాలు

రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్ర‌కారం జ‌న‌వ‌రిలో బ్యాంకులు సెల‌వులు ఇవే..

జనవరి 1 – సోమ‌వారం – ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్ టక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమ, షిల్లాంగ్ (న్యూ ఇయ‌ర్)
జనవరి 2 – మంగళవారం – ఐజ్వాల్ (న్యూ ఇయ‌ర్ )
జనవరి 7 – ఆదివారం – దేశంలోని అన్ని బ్యాంకుల‌కు
జనవరి 11 – గురువారం – ఐజ్వాల్ (మిషనరీ డే)
జనవరి 13 – శనివారం – దేశంలోని అన్ని బ్యాంకుల‌కు (రెండో శనివారం)
జనవరి 14 – ఆదివారం – దేశంలోని అన్ని బ్యాంకుల‌కు
జనవరి 15 – సోమవారం – బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్ టక్, గువాహటి, తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ (సంక్రాంతి)
జనవరి 16 – మంగళవారం – చెన్నై (తిరువల్లూర్ డే)
జనవరి 17 – బుధవారం – చండీగఢ్, చెన్నై (ఉజ్వల్ తిరునాళ్లు, శ్రీ గురు గోవింద్ జింగ్ జయంతి)
జనవరి 21 – ఆదివారం – దేశంలోని అన్ని బ్యాంకుల‌కు
జనవరి 22 – సోమవారం – ఇంఫాల్ (ఇమైనొ ఇరట్పా)
జనవరి23 – మంగళవారం – ఇంఫాల్ (గాన్-న్ఘాయి )
జనవరి 25 – గురువారం – చెన్నై, కాన్పూర్, లక్నో (థాయి పూసం, మహ్మద్ హజరత్ అలీ)
జనవరి 26 – శుక్రవారం – అగర్తల, డెహ్రాడూన్, కోల్‌కతా మినహా దేశమంతా సెలవు (గణతంత్ర దినోత్సవం)
జనవరి 27 – శనివారం – దేశంలోని అన్ని బ్యాంకుల‌కు (నాలుగో శనివారం)
జనవరి 28 – ఆదివారం – దేశంలోని అన్ని బ్యాంకుల‌కు