Bank Interest Rates : హోం లోన్ తీసుకున్నారా? భారీగా వడ్డీ రేట్లను తగ్గించిన టాప్ 6 బ్యాంకులివే.. మీ EMI ఎంత తగ్గుతుందంటే?

Bank Interest Rates : స్టేట్ బ్యాంక్, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి.

Bank Interest Rates

Bank Interest Rates : మీరు హోం లోన్ తీసుకున్నారా? ప్రతి నెలా భారీమొత్తంలో ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్ (HDFC), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) వంటి పెద్ద బ్యాంకులు (Bank Interest Rates) తమ రుణ వడ్డీ రేట్లను భారీ తగ్గించాయి.

ఇప్పటి నుంచి మీరు చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గుతుంది. ప్రతి నెలా మీకు కొంత డబ్బు ఆదా అవుతుంది. తాజా వడ్డీ రేట్లు ఏంటి? మీరు ఎంత డబ్బు ఆదా చేస్తారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మార్చలేదు.

కానీ, బ్యాంకులు ఇప్పుడు గత వడ్డీ రేట్ల ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఫలితంగా, వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఏయే బ్యాంకు ఎంతమొత్తంలో వడ్డీ రేట్లను తగ్గించాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరికి లాభమంటే? :
అందరు గృహ రుణ కస్టమర్లు ప్రయోజనం పొందలేరు. ఈ వడ్డీ రేట్లు తగ్గింపు MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)తో లింక్ అయిన రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. 2019కి ముందు, బ్యాంకులు రుణ వడ్డీ రేట్ల కోసం (MCLR) ఉపయోగించాయి. ఎంసీఎల్ఆర్ బ్యాంకు సొంత ‘ఆపరేటింగ్ కాస్ట్’గా పరిగణించవచ్చు.

మీ రుణ వడ్డీ రేటు దీనిపైనే ఆధారపడి ఉంటుంది. 2019 నుంచి కొత్త రుణాలు EBLR (ఎక్స్‌ట్రనల్ బెంచ్‌మార్క్ లోన్ రేటు)కి లింక్ అయ్యాయి. ఆర్బీఐ రెపో రేటుతో పాటు EBLR అనేది ఆర్బీఐ రేట్లను సర్దుబాటు చేసినప్పుడు మారుతుంది. ఒకవేళ, మీ రుణం EBLRలో ఉంటే కొత్త వడ్డీ రేటు తగ్గింపు వర్తించదు.

ఏ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి? :

ఆగస్టు 2025లో కొత్త వడ్డీ రేట్లను తగ్గించిన ప్రధాన బ్యాంకులు ఇవే..
స్టేట్ బ్యాంక్ : 7.90 శాతం నుంచి 8.85 శాతం, 0.05 శాతం తగ్గాయి. ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా : 7.95 శాతం నుంచి 8.80 శాతం, 0.10 శాతం నుంచి 0.35శాతం తగ్గాయి. ఆగస్టు 12, 2025 నుంచి అమలులోకి..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 8.15 శాతం నుంచి 9.15శాతం, 0.05శాతం తగ్గాయి. ఆగస్టు 1, 2025 నుంచి అమలులోకి..
కెనరా బ్యాంక్ : 7.95 శాతం నుంచి 8.95శాతం ఎలాంటి మార్పు లేదు. ఆగస్టు 12, 2025 నుంచి అమలులోకి వస్తాయి.
HDFC బ్యాంక్ : 8.55శాతం నుంచి 8.75శాతం, స్వల్ప తగ్గింపు. ఆగస్టు 7, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ :
కొత్త రేట్లు 8.05 శాతం నుంచి 8.90 శాతం వరకు ఉంటాయి. 0.10 శాతం తగ్గాయి. ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి వస్తాయి. ఈ కోతలు కొద్దిగా అనిపించవచ్చు. కానీ, దీర్ఘకాలిక గృహ రుణాలకు చాలా ఎక్కువ డబ్బును ఆదా చేస్తాయి.

Read Also : UPI Transaction Limits : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై రోజుకు ఇంతకన్నా ఎక్కువగా పేమెంట్లు చేయలేరు.. ఫుల్ డిటెయిల్స్..!

మీ ఈఎంఐ ఎంత తగ్గుతుందంటే? :

0.05 శాతం లేదా 0.10 శాతం రేటు తగ్గినా కూడా చాలా ఆదా చేస్తుంది. ఎందుకంటే.. గృహ రుణాల కాలపరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. మీరు 9.00శాతం వడ్డీ రేటుతో 20 సంవత్సరాలకు రూ. 30 లక్షల గృహ రుణం తీసుకుంటే.. మీ ఈఎంఐ రూ. 26,992 అవుతుంది.

బ్యాంక్ రేటును 0.05శాతం తగ్గిస్తే.. మీ కొత్త రేటు 8.95శాతం అవుతుంది. మీ ఈఎంఐ రూ. 26,894 అవుతుంది. మీరు నెలకు రూ.98, ఏడాదికి రూ.1,176 ఆదా అవుతుంది. 20 ఏళ్లలో ఇదే విషయాన్ని పరిశీలిస్తే.. రూ.23,520 ఆదా చేస్తారు. రేటు తగ్గింపు 0.10శాతం అయితే, మీ సేవింగ్స్ దాదాపు రెట్టింపు అవుతుంది. మొత్తం కాలవ్యవధిలో రూ.47వేల కన్నా ఎక్కువ ఆదా చేయొచ్చు.

మీరు ఏం చేయాలి? :
బ్యాంక్ ఈఎంఐ ఆటోమేటిక్‌గా తగ్గించేవరకు చూడొద్దు. మీ లోన్ MCLR లేదా EBLRతో లింక్ అయిందో లేదో మీ లోన్ డాక్యుమెంట్లను చెక్ చేయండి. MCLR లోన్ రేట్లు వెంటనే మారవు. సాధారణంగా ప్రతి 6 నెలలు లేదా ఏడాదికి ‘రీసెట్ తేదీ’లో అప్‌డేట్ అవుతాయి. మీ ఈఎంఐ ఎప్పుడు తగ్గుతుందో తెలియాలంటే మీ రీసెట్ తేదీ ఎప్పుడు అనేది మీ బ్యాంక్‌ని అడగండి.

అవసరమైతే మీ MCLR లోన్ నుంచి EBLRగా మార్చుకోవచ్చు. EBLR RBI రెపో రేటును అందిస్తుంది. ఆర్బీఐ రేట్లను తగ్గిస్తే.. మీ ఈఎంఐ కూడా వెంటనే తగ్గుతుంది. అలాగే, ఆర్బీఐ రేట్లను పెంచితే మీ ఈఎంఐ వెంటనే పెరుగుతుంది. MCLR రేట్లు కొంత నెమ్మదిగా మారుతాయి.