మూడు నెలలు ఈఎమ్‌ఐలు కట్టక్కర్లేదు

  • Publish Date - March 27, 2020 / 05:27 AM IST

కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మూడవ రోజు లాక్‌డౌన్ కొనసాగుతుండగానే.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు అంటూ ప్రకటన చేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని ప్రకటించిన శక్తికాంత దాస్.. మార్కెట్లోకి రూ.3.75 లక్షల కోట్లను పంపింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా మహమ్మారి ఆర్బీఐ అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉందని, ఇలాగే ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్లోకు నగదు పంపింగ్, ఈఎంఐలపై భారీ ఊరట కల్పించారు. అన్నిరకాల టర్మ్ లోన్ల ఈఎంఐలపై మార్చి నుండి మూడు నెలల పాటు మారటోరియం(తాత్కాలిక నిషేదం) ఉంటుందని వెల్లడించారు.

సామాన్యులకు ఊరట ఇచ్చేలా మూడు నెలలపాటు అన్ని బ్యాంకులు, రుణ సంస్థలు తాత్కాలిక నిషేధాన్ని అనుమతించవచ్చు అని ఆర్బిఐ గవర్నర్ స్పష్టం చేశారు. రియల్ ఎకానమీకి ఆర్థిక ఒత్తిడి లేకుండా చెయ్యడానికి రుణ భారాన్ని తగ్గించి, రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించినట్లు చెప్పారు.

అయితే ఈ ఈఎమ్ఐలు తర్వాత మాత్రం కట్టవలసి ఉంటుంది. 

Also Read | ఆర్‌బీఐ కీలక ప్రకటన: రేపో రేటు తగ్గింపు

ట్రెండింగ్ వార్తలు