Banks New Rule
Banks New Rule : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. బ్యాంకు రూల్స్ మారాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరికి బ్యాంక్ అకౌంట్ (Banks New Rule) అనేది కామన్. అసలు బ్యాంకు అకౌంట్ లేని వారంటే చాలా తక్కువ మందే ఉంటారు. బ్యాంకు అకౌంట్ మాత్రమే కాదు.. మీ అకౌంటుకు నామినీ (bank account nominee death) కూడా తప్పక ఉండాలి. కానీ, చాలామందికి నామినీ గురించి అవగాహన ఉండదు.
ఒక వ్యక్తి బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీ పేరును అదే సమయంలో ఇవ్వాలి. ఖాతాదారుడి మరణం తర్వాత ఆ ఖాతాలోని డబ్బుకు అర్హులైన వ్యక్తి నామినీ మాత్రమే. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఖాతాదారుడు నామినీని ఎంచుకోవాలి.
అదే ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే.. ఇలాంటి సందర్భాల్లో ఆ ఖాతాలోని డబ్బుకు ఎవరు అర్హులు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటి? ఎవరికి ఖాతాలో డబ్బు చెందుతుంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నామినీ మరణిస్తే అకౌంటులో డబ్బు ఎవరికి సొంతం? :
నామినీ, ఖాతాదారుడు ఇద్దరూ మరణిస్తే.. చట్టపరమైన వారసుడే ఆ ఖాతాలో డబ్బుకు అర్హులు. ఈ చట్టపరమైన వారసుడు ఖాతాదారుడి కుటుంబంలో సభ్యుడిగా ఉండాలి. ఇందులో భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు లేదా తోబుట్టువులు ఉండవచ్చు.
ఖాతాదారుడు, నామినీ ఇద్దరు మరణిస్తే.. సంబంధిత కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. అలాగే, మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాలి. కుటుంబ సభ్యులు తమ గుర్తింపును ధృవీకరించిన తర్వాత బ్యాంకు నుంచి అకౌంటులో డబ్బును తీసుకోవచ్చు.
చాలా సందర్భాలలో, బ్యాంకు కుటుంబ సభ్యుని నుంచి చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రాన్ని కూడా అడగవచ్చు. అదే సమయంలో ఖాతాలో ఎక్కువ డబ్బు ఉంటే కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రాన్ని బ్యాంకులో సమర్పించాలి.
భారతీయ వారసత్వ చట్టం ప్రకారం.. బ్యాంకు ఈ డబ్బును కుటుంబ సభ్యులకు మాత్రమే అందిస్తుంది. ఖాతాదారునికి వీలునామా ఉంటే.. ఆ వీలునామా ప్రకారమే డబ్బు ఆయా కుటుంబ సభ్యులకు బ్యాంకు అందజేస్తుంది.