Google Pixel 9 Pro XL : సూపర్ ఆఫర్ భయ్యా.. పిక్సెల్ 9 ప్రో XLపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. AI ఫీచర్లు అదుర్స్, ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో రూ. 30వేలు తగ్గింపుతో లభిస్తోంది.

Google Pixel 9 Pro XL
Google Pixel 9 Pro XL : కొత్త ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, గూగుల్ పిక్సెల్ ఫోన్ తీసుకోండి. ప్రస్తుత రోజుల్లో కెమెరా ఫోన్ అనగానే చాలామంది (Google Pixel 9 Pro XL) పిక్సెల్ ఫోన్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే కెమెరా ఫీచర్లు బాగుంటాయి. పిక్సెల్ ఫోన్లలో పిక్సెల్ 9 ప్రో XL కూడా అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ AI ఫీచర్లతో పాటు హార్డ్‌వేర్, అద్భుతమైన సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. వాస్తవానికి, ఈ పిక్సెల్ ఫోన్ లాంచ్ ధర లక్షకు పైనే ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధర (Flipkart Freedom Sale Offers) ఈ పిక్సెల్ 9 ప్రో Xl ఫోన్ అత్యంత చౌకైన ధరకే లభిస్తోంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో పిక్సెల్ ఫోన్ ధర రూ. 30వేలు డిస్కౌంట్ పొందింది. గత ఏడాదిలో పిక్సెల్ 9 ప్రో XL 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,24,999కు లాంచ్ అయింది. మీరు ఫ్లిప్‌కార్ట్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ప్రో XL డీల్ :
ప్రస్తుతం ఈ గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL (Google Pixel 9 Pro XL) ధర రూ.20వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది. ధర రూ.1,04,999కి తగ్గింది. అదనంగా, కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.10వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం పాత ఫోన్ మోడల్, డివైజ్ వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 72వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూతో మార్చుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 6.7-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే కలిగి ఉంది. హైరిజల్యూషన్ 1344 x 2992 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, HDRకి సపోర్టు ఇస్తుంది. 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ కలిగి ఉంది. పిక్సెల్ 9 ప్రో XL 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5060mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9 ప్రో XL బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో OISతో 50MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా కలిగి ఉంది.