6 Best Camera Phones : రక్షా బంధన్ 2025.. మీ సోదరి కోసం రూ. 15వేల లోపు ధరలో 6 బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారో మీ ఇష్టం..!

6 Best Camera Phones : రక్షా బంధన్ పండగ సందర్భంగా మీకు రాఖీ కట్టిన సోదరికి అద్భుతమైన కెమెరా ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి చూడండి..

6 Best Camera Phones : రక్షా బంధన్ 2025.. మీ సోదరి కోసం రూ. 15వేల లోపు ధరలో 6 బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారో మీ ఇష్టం..!

6 Best Camera Phones

Updated On : August 5, 2025 / 9:37 PM IST

6 Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఆగస్టు నెలలో రక్షా బంధన్ 2025 వస్తోంది. ఈ పండగ సందర్భంగా తమ సోదరుడికి రాఖీలు (6 Best Camera Phones) కట్టేందుకు ఆడబిడ్డలు వస్తుంటారు. ఈ సమయంలో మీ సోదరికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 15వేల లోపు ధరలోపు 6 బెస్ట్ కెమెరా ఫోన్‌లు ఉన్నాయి.

ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్‌లు అద్భుతమైన ఫొటో క్వాలిటీని అందిస్తాయి. అంతేకాదు సరసమైన ధరలో ఎంతో స్టైలిష్‌గా ఆకట్టుకునేలా ఉంటాయి. ఏయే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.. వాటి ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పోకో M7 ప్రో (రూ. 12,999) :
పోకో M7 ప్రో ఫోన్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ 50MP+2MP మెయిన్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అద్భుతమైన క్లారిటీతో ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

ఒప్పో K13x (రూ. 11,999) :
ఒప్పో K13x ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల LCD డిస్‌ప్లే కలిగి ఉంది. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఒప్పో ఫోన్ ఫొటోల కోసం డ్యూయల్ 50MP+2MP బ్యాక్ లెన్స్‌తో పాటు 8MP సెల్ఫీ షూటర్‌ కలిగి ఉంది.

Read Also : SIM Blocked : DoT అలర్ట్.. 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఇలా SIMs వాడితే అంతే.. మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అయిందేమో చెక్ చేసుకోండి!

శాంసంగ్ గెలాక్సీ M16 (రూ. 12,999) :
శాంసంగ్ గెలాక్సీ M16 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌ అందించే 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. ట్రిపుల్ 50MP+5MP+2MP ప్రైమరీ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.

మోటోరోలా G64 (రూ. 13,999) :
మోటోరోలా G64 ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. మొబైల్ యూనిట్ మీడియాటెక్ డైమన్షిటీ 7025 చిప్‌సెట్‌ ఉపయోగిస్తుంది. డ్యూయల్ 50MP+8MP బ్యాక్ కెమెరా సెటప్‌తో పాటు 16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుంది. ప్రతి షాట్‌తో క్రిస్టల్-క్లియర్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

ఐక్యూ Z10x (రూ. 13,690) :
ఐక్యూ Z10x ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.72-అంగుళాల IPS LCD ప్యానెల్ ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ 50MP+2MP ప్రైమరీ లెన్స్, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. షార్ప్, క్లియర్, వైబ్రెంట్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

రియల్‌మి నార్జో 80x (రూ. 12,599) :
మీడియాటెక్ డైమన్షిటీ 6400 5G ప్రాసెసర్‌తో రియల్‌మి నార్జో 80x 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల FHD+ ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+2MP డ్యూయల్ కెమెరా కాన్ఫిగరేషన్, సెల్ఫీలు, వీడియో క్వాలిటీ కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా కలిగి ఉంది.