Best Smart TVs
Best Smart TVs : కొత్త టీవీ కొనేందుకు చూస్తున్నారా? మీ ఇంట్లో లేదా బెడ్ రూం కోసం టీవీ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. తక్కువ ఖర్చుతో అద్భుతమైన స్మార్ట్ టీవీని కొనేసుకోవచ్చు. అమెజాన్ ప్రస్తుత డీల్స్ ద్వారా అదిరిపోయే ఆఫర్లను పొందవచ్చు. 43-అంగుళాల (108 సెం.మీ) స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ లిస్టులో షావోమీ, శాంసంగ్, ఏసర్, వన్‌ప్లస్ వంటి టాప్ బ్రాండ్‌లు ఉన్నాయి. అన్నీ 4K అల్ట్రా HD క్వాలిటీతో రూ. 18వేల నుంచి రూ. 25వేల వరకు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలన్నీ 4K రిజల్యూషన్, గూగుల్ టీవీ OSతో వస్తాయి. OTT ప్లాట్‌ఫారమ్‌లకు కూడా సపోర్టు ఇస్తాయి.
హైయర్ S800 సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ :
హైయర్ నుంచి వచ్చిన క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ 43-అంగుళాల 4K అల్ట్రా HD క్వాలిటీతో లభిస్తుంది. ఈ టీవీ ప్రీమియం డిస్‌ప్లే, స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంది. మీరు అమెజాన్ నుంచి రూ.33,569కి కొనుగోలు చేయవచ్చు. QLED డిస్‌ప్లేతో వస్తుంది. గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో వస్తుంది.
సోనీ బ్రావియా 2M2 సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ గూగుల్ టీవీ :
ఈ సోనీ టీవీ 43-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో వస్తుంది. అమెజాన్ నుంచి రూ.37,490కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో సిగ్నేచర్ 4K ప్రాసెసర్ X1, లైవ్ కలర్ టెక్నాలజీ ఉన్నాయి. సాధారణ టీవీల కన్నా అద్భుతంగా ఉంటుంది. ప్రతి విజువల్ నేచురల్ కలర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
ఎల్‌జీ UA82 సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ వెబ్ OS :
ఎల్‌జీ బ్రాండ్ అనేది క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు అందించే ప్రీమియం టీవీ. మీరు అమెజాన్ నుంచి రూ. 29,990 లిమిటెడ్ డిస్కౌంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలో α7 ఏఐ ప్రాసెసర్ ఉంది. 4K Gen8, webOS 25తో మరింత స్మార్ట్‌గా చేస్తుంది. మీ ఇంటిని చిన్నపాటి హోం థియేటర్‌గా మార్చేస్తుంది.
టీసీఎల్ P7K సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED టీవీ :
టీసీఎల్ నుంచి వచ్చిన ఈ 43-అంగుళాల టీవీ 4K అల్ట్రా HD క్వాలిటీతో వస్తుంది. బడ్జెట్ ధరలో ఈ టీవీ అద్భుతంగా ఉంటుంది. QLED టెక్నాలజీ, పవర్‌ఫుల్ సౌండ్ అందిస్తుంది. మీరు అమెజాన్ నుంచి రూ.27,990కి కొనుగోలు చేయవచ్చు. మీరు రూ. 1,000 స్పెషల్ డిస్కౌంట్ కూపన్ కూడా పొందవచ్చు. మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్, 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ కూడా అందిస్తుంది.
మీరు పెద్ద టీవీ కొనాలంటే ధర కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కానీ, ఫీచర్లు బాగుంటాయి. 28 అంగుళాలు లేదా 32-అంగుళాల టీవీ కావాలంటే తక్కువ ధరలో కొనేసుకోవచ్చు. అయితే, మీరు అమెజాన్‌లో ఇతర ఆఫర్లను కూడా ఎంచుకోవచ్చు.