Credit Card Rule : క్రెడిట్ కార్డు కొత్త రూల్స్.. లేట్ పేమెంట్లపై బిగ్ రిలీఫ్.. యూజర్లకు బెనిఫిట్స్ ఏంటి? ఫుల్ డిటెయిల్స్..!
Credit Card Rule : క్రెడిట్ కార్డ్ పేమెంట్లు ఆలస్యమైతే ఇకపై పెనాల్టీలు ఉండవా? ఆర్బిఐ కొత్త మార్గదర్శకాలేంటి? లేటు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదా? కస్టమర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Credit Card Rule
- క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
- ఏప్రిల్ 1, 2027 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి
- ఆలస్యంగా క్రెడిట్ బిల్లు పేమెంట్ చేసినా నో పెనాల్టీలు?
Credit Card Rule : క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇకపై ఆలస్యంగా పేమెంట్ చేస్తే పెనాల్టీలు ఉండవా? ఆర్బిఐ నిబంధనలలో కొత్త మార్పులు చేసింది. వినియోగదారులకు కొంత రిలీఫ్ అనే చెప్పాలి. ఆర్బీఐ ప్రకారం.. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇందులో ఆలస్య చెల్లింపుపై విధించే ఛార్జీలు, జరిమానాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇప్పుడు, క్రెడిట్ బిల్లు చెల్లించడంలో కొద్దిగా ఆలస్యం జరిగినా మీరు నేరుగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోవాలి.
కొత్త ఆర్బీఐ రూల్ ఏంటి? :
మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును గడువు తేదీ నుంచి 3 రోజులలోపు చెల్లించకపోతే మీ ఖాతా గడువు దాటినట్లుగా అర్థం. మీకు వెంటనే పెనాల్టీ పడదు. కానీ, మీకు 3 రోజుల స్వల్ప గడువు ఉంటుంది. ఆ గడువులోగా బిల్ ఫుల్ పేమెంట్ చేయాలి. లేదంటే భారీగా పెనాల్టీలు తప్పవు.
క్రెడిట్ కార్డు ఛార్జీని ఎలా విధిస్తారు? :
కొత్త నిబంధన ప్రకారం.. ఆలస్య రుసుమును పూర్తి బిల్లు మొత్తంపై కాకుండా కేవలం చెల్లించాల్సిన బకాయిపై మాత్రమే విధిస్తారు. దీనివల్ల వినియోగదారులపై అదనపు వడ్డీ భారం తగ్గుతుంది. అయినప్పటికీ, ఆలస్య రుసుమును గడువు తేదీ నుంచే లెక్కిస్తారు.
క్రెడిట్ కార్డు యూజర్లకు బెనిఫిట్ ఏంటి? :
క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నపాటి ఆలస్యాలకు ఇకపై ఇన్స్టంట్ ఛార్జీలు ఉండవు. అయితే, మీరు పేమెంట్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా పర్వాలేదని కాదు.. వడ్డీ, ఇతర నిబంధనలు అలాగే ఉన్నాయి.
బిల్లులను సకాలంలో తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ కేవలం క్రెడిట్ కార్డు యూజర్లు డ్యూ డేట్ ఆలస్యమైనా 3 రోజుల వరకు టైమ్ ఉంటుంది. అప్పటిలోగా పెండింట్ అమౌంట్ మొత్తం క్లియర్ చేయాలి. లేదంటే భారీగా పెనాల్టీలు తప్పవు.
