×
Ad

Best Budget Cars : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 10 లక్షల్లో టాప్ 5 లగ్జరీ లుక్ బడ్జెట్ కార్లు.. స్టైల్, మైలేజీ కోసమైన కొనేసుకోవచ్చు!

Best Budget Cars : మీరు రూ. 10 లక్షల లోపు కారు కొనాలని చూస్తుంటే ఇంధన సామర్థ్యం, ​​సౌకర్యం, స్టైలిష్ లుక్‌ను అందించే అద్భుతమైన బడ్జెట్ కార్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

Best Budget Cars

Best Budget Cars : కొత్త కారు కొంటున్నారా? మంచి మైలేజీని ఇచ్చే కారు కొనాలని అనుకుంటే ఇది మీకోసమే.. జీఎస్టీ పన్నుల తగ్గింపుతో చాలా కంపెనీల కార్ల ధరలు భారీగా తగ్గాయి. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో స్టైల్ ఫీచర్ల కన్నా మైలేజీపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

మీరు కూడా రూ. 10 లక్షల బడ్జెట్‌లో కారు (Best Budget Cars) కొనేసుకోవచ్చు. మీకు సౌకర్యం, స్టైలిష్ లుక్‌తో పాటు అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రూ. 10 లక్షల లోపు ధరలో అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఎంచుకుని కొనేసుకోండి.

మారుతి సుజుకి సెలెరియో :
మారుతి సుజుకి సెలెరియో భారత మార్కెట్లో టాప్ ప్లేసులో ఉంది. అద్భుతమైన మైలేజ్, సరసమైన ధరలో వస్తుంది. ఈ కారు ధరలు దాదాపు రూ. 4.7 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. పెట్రోల్, CNG ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 26.6 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. అయితే, CNG వేరియంట్ కిలోకు 35.12 కి.మీ మైలేజీని అందిస్తుంది. రోజువారీ నగర డ్రైవింగ్ కోసం తేలికైన కారు కోసం చూస్తున్న వాహనదారులకు సెలెరియో అద్భుమైన ఆప్షన్.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ :

భారత మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అత్యంత పాపులర్ ఫ్యామిలీ కార్లలో ఒకటి. సుమారు రూ. 5 లక్షల ధరతో లీటరుకు 26.1 కి.మీ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎత్తైన సీటింగ్, వైడ్ క్యాబిన్ అద్భుతమైన ఆప్షన్. వ్యాగన్ఆర్ కూడా చాలా తేలికైనది. నగర ట్రాఫిక్‌లో కూడా ఈజీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. పాపులర్ ఆల్ రౌండర్‌ కారు అని చెప్పొచ్చు.

Read Also : Top 5 Smartphones : ఈ టాప్ 5 కిల్లర్ ఫోన్లు చూస్తే.. శాంసంగ్ ఫ్యాన్స్ కూడా ఎగబడి కొనేస్తారు.. మార్కెట్‌నే షేక్ చేస్తున్నాయ్..!

మారుతి సుజుకి ఆల్టో K10 :
మీ బడ్జెట్ పరంగా ఆల్టో K10 మీకు బెస్ట్ ఆప్షన్. ఈ కారు రూ. 7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 24.8 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. కాంపాక్ట్ సైజు, లో-మేనేజ్‌మెంట్, ఈజీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ఆల్టో K10 కొత్త డ్రైవర్లలో పాపులర్ ఆప్షన్ కలిగి ఉన్నాయి. ఆఫీసు లేదా చిన్న రోజువారీ సిటీ జర్నీలకు సరసమైన కారు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ :
హ్యుందాయ్ ఎక్స్‌టర్ స్టైల్ మైలేజ్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్. రూ.5.7 లక్షల నుంచి ప్రారంభమై లీటరుకు 19 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఎక్స్‌టర్ అడ్వాన్స్ SUV లుక్, హై గ్రౌండ్ క్లియరెన్స్ ఫీచర్-ప్యాక్డ్ ఇంటీరియర్ కలిగి ఉంది. SUV లాంటి లుక్స్ బడ్జెట్‌లో అత్యుత్తమ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.

టాటా పంచ్ :
టాటా పంచ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో SUV కార్లలో ఒకటి. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ. 6 లక్షలు. పంచ్ లీటరుకు దాదాపు 18 కి.మీ మైలేజీని అందిస్తుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కలిగి ఉంది. ఇంటీరియర్‌లో ప్రీమియం టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హైట్ అడ్జెస్‌మెంట్ సీట్లు ఉన్నాయి.