Top 5 Smartphones : ఈ టాప్ 5 కిల్లర్ ఫోన్లు చూస్తే.. శాంసంగ్ ఫ్యాన్స్ కూడా ఎగబడి కొనేస్తారు.. మార్కెట్‌నే షేక్ చేస్తున్నాయ్..!
Samsung Galaxy S24 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కన్నా అద్భుతమైన ఫీచర్లతో 5 ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఏది కొంటారో కొనేసుకోండి.

Samsung Galaxy S24 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా త్వరలో మార్కెట్లోకి రానుంది. కానీ, కొన్ని ఏళ్ల క్రితమే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఇప్పటికీ ఆ సెగ్మెంట్‌లో అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. మీరు కూడా శాంసంగ్ కాకుండా ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. కెమెరా, బ్యాటరీ పరంగా ఇలాంటి ఫీచర్లు కలిగిన అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఫోన్ కొనేసుకోండి.

గూగుల్ పిక్సెల్ 10 (రూ. 70,520) : కెమెరా, బ్యాటరీ పర్ఫార్మెన్స్ పరంగా గూగుల్ పిక్సెల్ 10 ఫుల్ పవర్‌హౌస్. కెమెరా విషయానికొస్తే.. ఈ యూనిట్ 5x ఆప్టికల్ జూమ్‌తో ట్రిపుల్ 48MP+10.8MP+13MP సెటప్ కలిగి ఉంది. 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే క్లియర్ కలర్ ఆప్షన్లతో అందిస్తుంది. ఆండ్రాయిడ్ ప్రియులు తప్పక కొనాల్సిన ఫోన్.

ఐఫోన్ 17 (రూ. 82,900) : ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ డ్యూయల్ 48MP కెమెరా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆపిల్ A19 చిప్‌సెట్, 3692mAh బ్యాటరీ, 25W వైర్‌లెస్ ఛార్జర్, 18MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కన్నా బెటర్ ఆప్షన్.

నథింగ్ ఫోన్ 3 (రూ. 59,999) : ఈ ఏడాది ప్రారంభంలో నథింగ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 5150mAh బ్యాటరీతో నథింగ్ ఫోన్ 3ని లాంచ్ చేసింది. కెమెరా విషయానికొస్తే.. ఈ నథింగ్ ఫోన్ 3 మోడల్ ట్రిపుల్ 50MP రియర్ కెమెరా, సింగిల్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. డిజైన్, పర్ఫార్మెన్స్, స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాతో ఈజీగా ఉంటుంది.

వన్‌ప్లస్ 13s (రూ. 51,999) : వన్‌ప్లస్ 13s డ్యూయల్ 50MP కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరాతో ఫ్లాగ్‌షిప్-లెవల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఆక్సిజన్OS 15 ఆపరేటింగ్ సిస్టమ్ 5850mAh బ్యాటరీతో వన్‌ప్లస్ 13s ఈ ధర రేంజ్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కన్నా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

శాంసంగ్ S25 (రూ. 74,999) : శాంసంగ్ S25 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది. ట్రిపుల్ కెమెరా కూడా ఉంది. 50MP+10MP+12MP 3x ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది. ఇంకా, 25W వైర్డ్ ఛార్జర్‌తో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రో వేరియంట్ కన్నా బెటర్ ఆప్షన్.
