Best Hybrid Cars
Best Hybrid Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు ఫుల్ క్రేజ్ పెరిగింది. 2025లో హైబ్రిడ్ కార్లు (Best Hybrid Cars) అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచాయి. ఇంధన ధరల పెరుగుదలతో ఎకో ఫ్రెండ్లీ వాహనాలపై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. దాంతో చాలామంది వినియోగదారులు హైబ్రిడ్ మోడల్ కార్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ కార్లలో స్పెషాలిటీ ఏంటంటే.. పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తాయి. తద్వారా ఇంధనాన్ని ఆదా చేయడమే కాదు.. కాలుష్య స్థాయిలను కూడా భారీగా తగ్గిస్తాయి. హైబ్రిడ్ వాహనాలలో డ్రైవింగ్ చేయడం సాధారణ పెట్రోల్ కార్ల కన్నా చాలా సున్నితంగా ఉంటుంది.
హైవే డ్రైవింగ్‌లో సిటీ డ్రైవింగ్‌లో మైలేజ్ పరంగా తక్కువ నష్టం ఉంటుంది. ఫ్యూచర్ రెడీ మోడల్ కార్లను కోరుకుంటే.. దేశంలోనే అత్యంత పాపులర్ హైబ్రిడ్ కార్లలో ఫీచర్లు, మైలేజ్, ధర వంటి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ :
భారతీయులు ఎక్కువగా ఇష్టపడే హైబ్రిడ్ కారు. టయోటా హైరైడర్‌లో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిఫైడ్ హైబ్రిడ్ మోటార్ కూడా ఉంది. బ్యాటరీ పవర్ మాత్రమే ఉపయోగించి తక్కువ వేగంతో కూడా డ్రైవ్ చేయగలదు. రోడ్డుపై ఇంధన వినియోగంలో హైరైడర్ ఫీచర్లలో బిగ్ టచ్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, కనెక్టింగ్ కార్ టెక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
మైలేజ్ : లీటరుకు 27.97 కి.మీ వరకు
ధర: రూ. 11.14 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)
మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ :
సూపర్-హైబ్రిడ్‌లలో మారుతి గ్రాండ్ విటారా ఒకటి. లగ్జరీ ఇంటీరియర్, భారీ మైలేజీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. హైబ్రిడ్‌లో భాగంగా హెడ్స్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా అమర్చారు. ఫ్యామిలీతో ప్రయాణాలు చేసేవారికి బెస్ట్ మోడల్ కారు.
మైలేజ్: లీటరుకు 27.97 కి.మీ వరకు
ధర: రూ. 10.99 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్)
హోండా సిటీ e:HEV :
హోండా సిటీ ఇప్పుడు సిటీ e:HEV మోడల్ కలిగి ఉంది. హోండా ప్రకారం.. హైబ్రిడ్ ప్యాక్‌లో బెస్ట్ మోడల్. ఈ కారు నడపడం చాలా ఈజీ. పవర్‌ఫుల్ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. హోండా సెన్సింగ్ కోసం లేన్ కీపింగ్ అసిస్టింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఢీకొనే ముందు వార్నింగ్ అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్ల రేంజ్‌తో వస్తుంది.
మైలేజ్ : సుమారుగా 27.13 కి.మీ/లీ
ధర : రూ. 19 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)
టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ :
ఏడుగురు కూర్చొనేలా విశాలంగా ఉంటుంది. పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌లు, ADAS, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఖరీదైనది కారు అయినప్పటికీ సుదూర డ్రైవింగ్‌కు బెస్ట్ మోడల్.
మైలేజ్ : లీటరుకు దాదాపు 23.24 కి.మీ.
ధర : రూ. 25.72 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)