Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025.. వన్‌ప్లస్ ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఇయర్ బడ్స్, ప్యాడ్ గోపై మరెన్నో ఆఫర్లు..!
Amazon Prime Day Sale : అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ 2025 సందర్భంగా వన్‌ప్లస్ 13, 13s, 13R, నార్డ్ CE4 లైట్ మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Prime Day Sale
Amazon Prime Day Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? జూలై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ కంపెనీ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు, IoT ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అధికారికంగా ప్రకటించింది. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13s, వన్‌ప్లస్ 13R వంటి ఫోన్లు, కొన్ని నార్డ్ సిరీస్ (Amazon Prime Day Sale 2025) ఫోన్‌లు భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
అంతేకాదు.. కస్టమర్‌లు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, టాబ్లెట్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. అమెజాన్‌తో పాటు జూలై 10 నుంచి జూలై 15 వరకు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ (OnePlus.in), ఆఫ్‌లైన్ పార్టనర్ స్టోర్‌లు, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో “OnePlus Monsoon Sale” కింద ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ అద్భుతమైన అన్ని డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 13, 13R, 13sపై డిస్కౌంట్లు :
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్, వన్‌ప్లస్ మాన్సూన్ సేల్ సందర్భంగా కస్టమర్లు వన్‌ప్లస్ 13ని రూ.59,999కి కొనుగోలు చేయొచ్చు. వన్‌ప్లస్ 13 కూడా రూ.5వేలు బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.49,999కి పొందవచ్చు.
ఈ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ వన్‌ప్లస్ 13R రూ.39,999కి ఫ్రీ వన్‌ప్లస్ బడ్స్ 3తో లభిస్తుంది. నార్డ్ సిరీస్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ CE 5 భారత్ లాంచ్‌కు ముందు రూ.2వేలు తగ్గింపు తర్వాత కస్టమర్లు రూ.15,999కి వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్‌ను పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ : బడ్స్ 3, నార్డ్ బడ్స్ 3 ప్రో ఆఫర్లు :
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3పై రూ.1,000 తగ్గింపుతో రూ.8,999కి పొందవచ్చు. బడ్స్ 3 రూ.4,299, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో రూ.300 తగ్గింపుతో రూ.2,399కి పొందవచ్చు. బుల్లెట్స్ వైర్‌లెస్ Z3 రూ.150 తగ్గింపు తర్వాత రూ.1,549కి లిస్ట్ అయింది.
అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ గో, ప్యాడ్ 2 సేల్ :
వన్‌ప్లస్ ప్యాడ్ గో (Wi-Fi 128GB) ధర రూ.13,999కు అందుబాటులో ఉంటుంది. ఇందులో విద్యార్థులు, బ్యాంకుల నుంచి భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు ఫ్రీ స్టయిలస్ 2తో వన్‌ప్లస్ ప్యాడ్ 2 (Wi-Fi 128GB) ధర రూ.32,99కు పొందవచ్చు. ఫ్రీ Stylus 2తో వన్‌ప్లస్ ప్యాడ్ 2 (Wi-Fi 256GB) ధర రూ.35,999కు పొందవచ్చు. కస్టమర్లు వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5పై అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు.