Tecno Pova 7 Series : గేమర్లకు పండగే.. కొత్త టెక్నో పోవా 7 సిరీస్ వచ్చేసింది.. 6000mAh బ్యాటరీ, కెమెరా ఫీచర్లు కేక.. ధర ఎంతో తెలుసా?
Tecno Pova 7 Series : కొత్త టెక్నో పోవా 7 సిరీస్ లాంచ్ అయింది. 6000mAh బ్యాటరీతో 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది.. ధర ఎంతంటే?

Tecno Pova 7 Series
Tecno Pova 7 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి టెక్నో నుంచి సరికొత్త పోవా 7 సిరీస్ ప్రవేశపెట్టింది. కంపెనీ మొత్తం 2 కొత్త వేరియంట్‌లను లాంచ్ చేసింది. అందులో పోవా 7, పోవా 7 ప్రో మోడల్స్. ఈ రెండు ఫోన్లు డెల్టా లైట్ ఇంటర్‌ఫేస్‌తో వస్తాయి.
బ్యాక్ ప్యానెల్‌లో 104 మినీ LED లైట్‌లు ఉంటాయి. ఈ లైట్లు నోటిఫికేషన్‌లు, కాల్స్, ఛార్జింగ్, మ్యూజిక్, వాల్యూమ్‌కు డైనమిక్‌గా అందిస్తాయి. టెక్నో పోవా 7 సిరీస్ ఫీచర్లు, ధర, స్పెషిఫికేషన్లు, ఆఫర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
ధర, ప్రారంభ ఆఫర్లు :
ఈ రెండు పోవా ఫోన్లు 2 వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
టెక్నో పోవా 7 :
8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999.
8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999.
టెక్నో పోవా 7 ప్రో :
8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ధర రూ.18,999.
8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999.
కలర్ వేరియంట్లు :
పోవా 7 మొత్తం 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.
మ్యాజిక్ సిల్వర్
గీక్ బ్లాక్
ఒయాసిస్ గ్రీన్
పోవా 7 ప్రో 2 కలర్ ఆప్షన్లు :
డైనమిక్ గ్రే
నియాన్ సియాన్
ఎక్కడ కొనాలి? :
జూలై 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. రూ. 2వేలు బ్యాంక్ డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్.
డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ :
6.78-అంగుళాల 144Hz డిస్‌ప్లే
పోవా 7 ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
పోవా 7 ప్రో షార్పర్ 1.5K అమోల్డ్ ప్యానెల్
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్
మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం 8GB ర్యామ్ + 8GB వర్చువల్ ర్యామ్
కెమెరా, బ్యాటరీ :
పోవా 7: 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
పోవా 7ప్రో : 64MP సోనీ IMX682 ప్రధాన సెన్సార్ + 8MP అల్ట్రా-వైడ్ లెన్స్.
ఈ 2 ఫోన్లలో 13MP సెల్ఫీ కెమెరా
45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6000mAh బ్యాటరీ.
పోవా 7 ప్రో 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు
సాఫ్ట్‌వేర్, ఫీచర్లు ఇవే :
ఆండ్రాయిడ్ 15-ఆధారిత HiOS 15పై రన్ అవుతుంది.
హిందీ, తమిళం, మరాఠీ సహా భారతీయ భాషలకు సపోర్టు
ఎల్లా AI చాట్‌బాట్ సపోర్టు
ఇంటెలిజెంట్ సిగ్నల్ ఆప్టిమైజేషన్
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ
టెక్నో పోవా 7 సిరీస్ స్పెషాలిటీ ఇదే :
104 మినీ LEDలతో ఫ్యూచరిస్టిక్ LED బ్యాక్ ప్యానెల్
స్పీడ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీ లాంగ్ లైఫ్
ప్రాంతీయ భాషా సపోర్టుతో ఏఐ చాట్‌బాట్
144Hz స్క్రీన్, ప్రీమియం ఫీచర్లు