Term Insurance Plan
Term Insurance Plan : ప్రస్తుత రోజుల్లో ఆర్థికంగా బలపడాలంటే సరైన ప్లానింగ్ అవసరం. ఒక కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేసినా లేదా ఇద్దరూ ఉద్యోగం చేసినా కూడా ఆర్థికంగా స్థిరత్వం కోరుకుంటున్నారు. ముందుగానే భవిష్యత్తు ప్రణాళికలపై ఒక నిర్ణయానికి వస్తున్నారు.
అందరిలోనూ ఎక్కువగా వినిపించే పదం పెట్టుబడి.. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం మంచి ప్లానింగ్.. ఇవి రెండు తప్పక ఉండాల్సిందే.. పెట్టుబడి ప్లానింగ్ తో పాటు మంచి ఇల్లు, కుటుంబ ఆర్థిక భద్రత కోసం టర్మ పాలసీ వంటివి ఎక్కువగా చూస్తున్నారు.
కొత్తగా పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే ఇంకా ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, చాలామందిలో ఇల్లు కొనాలనే కలతో పాటు అవసరమైన డబ్బు చేతికి అందేలా దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
కానీ, ఇంకా చాలామందికి సరైన ఆర్థిక ప్రణాళిక అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. అందుకు కారణం సరైన అవగాహన లేకపోవడం, ఏది ఎలా మొదలుపెట్టాలో తెలియకపోవడం ఇలాంటివి చాలామందిలో అనేక సందేహాలకు తావిస్తోంది.
ఉదాహరణకు.. ఒక జంటకు ఇటీవలే పెళ్లి అయిందని అనుకుందాం. వారిద్దరూ ఉద్యోగులే. ముందుగానే స్థిరమైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. మరో నాలుగేళ్లలో ఇల్లు కూడా కొనాలని ఆలోచన ఉంది.
Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 17కు ముందే ఐఫోన్ 16 ధర తగ్గిందోచ్.. ఇది కదా డిస్కౌంట్ అంటే.. డోంట్ మిస్!
ఇద్దరూ ఉద్యోగులు కావడంతో ఉమ్మడిగా నెలకు రూ. 60వేలు వరకూ సేవింగ్స్ చేయగలరు. అయితే, వీరిద్దరూ కలిసి ఉమ్మడిగా టర్మ్ పాలసీ తీసుకోవచ్చా? అలా అయితే పెట్టుబడి ప్లానింగ్ ఏ తరహాలో ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉంటుంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనప్పటకీ కూడా టర్మ్ పాలసీ అనేది ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు. విడిగా తీసుకుంటేనే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అది కూడా వార్షిక ఆదాయానికి 12 రెట్లు వరకూ టర్మ్ పాలసీ తీసుకుని ఉండాలి.
ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ :
కనీసం 35 ఏళ్లు వచ్చేవరకు పాలసీ కొనసాగేలా ఎంచుకోవాలి. అంతేకాదు.. ఫ్యామిలీ మొత్తానికి కూడా వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకోవాలి. భార్యాభర్తలిద్దరికి 6 నెలల ఖర్చులకు సరిపోయేలా ఎమర్జెన్సీ ఫండ్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఎలాగో ఇల్లు కొనే ప్లానింగ్ కూడా ఉంది కాబట్టి నాలగేళ్లు సమయంలో అవసరమైన పెట్టుబడికి ప్లానింగ్ చేసుకోండి.
ఎంత మొత్తంలో పెట్టుబడి పెడతారు అనేది ఆలోచించుకుని మల్టీ అసెట్, బ్యాలెన్సెడ్ అడ్వాంటేజ్ ఫండ్లలో సిప్ చేయాలి. మీరు కొనే ఇంటి విలువలో కనీసం 35 శాతం వరకూ పేమెంట్ చేసేలా చూసుకోవాలి. లోన్ వాయిదా మీ నికర ఆదాయంలో 35 శాతానికి మించి ఉండకుండా చూసుకోవాలి. అలాగే మీరు తీసుకునే లోన్ మొత్తానికి కూడా కవర్ అయ్యేలా టర్మ్ పాలసీని తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు.