Best Laptops in April : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఈ నెలలో రూ. 50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!

Best Laptops in April : ఏప్రిల్ 2023లో భారత మార్కెట్లలో రూ. 50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లను మీకోసం అందిస్తున్నాం. HP, Lenovo, Asus, Xiaomi, Infinix వంటి కంపెనీ ల్యాప్‌టాప్‌లను ఓసారి లుక్కేయండి.

Best Laptops in April (Photo : Google Images)

Best Laptops in April : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఏప్రిల్ 2023లో వివిధ ధరల్లో అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో భారత మార్కెట్లో రూ.50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాం. వినియోగదారులు రూ. 50K కేటగిరీలో అద్భుతమైన అప్‌గ్రేడ్‌లను పొందవచ్చు. ముందుగా, PC OEMలు ల్యాప్‌టాప్‌లు వేగవంతమైన RAM, స్టోరేజీ టెక్నాలజీతో వచ్చాయి. అదనంగా, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు సాధారణంగా పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటాయి.

ఇదే ధర వద్ద ఇతర నిఫ్టీ ఫీచర్‌లలో ఫింగర్‌ప్రింట్ స్కానర్ (Fingerprint Scanner) లేదా వెబ్‌క్యామ్ షట్టర్ (Web Cam Shutter) ఉన్నాయి. గేమింగ్-సెంట్రిక్ కస్టమర్‌ల కోసం.. ఇదే రేంజ్‌లో మంచి ల్యాప్‌టాప్‌లను సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 2023లో రూ. 50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లకు సంబంధించిన వివరాలను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన మోడల్ ల్యాప్‌టాప్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.

HP ల్యాప్‌టాప్ 14s :
మీరు ఆఫీసు లేదా కాలేజీ చదువుల కోసం ల్యాప్‌టాప్‌ చూస్తున్నారా? HP 14s ల్యాప్‌టాప్ బెస్ట్ ఆప్షన్. 14-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. పెద్ద ల్యాప్‌టాప్‌లను కోరుకునే కస్టమర్‌లకు బాగా నచ్చుతుంది. ఈ నోట్‌బుక్ బరువు కేవలం 1.4 కిలోలు.. మీరు HP స్టోర్ ద్వారా కొనుగోలు చేస్తే.. ఉచితంగా HP బ్యాగ్‌ని పొందవచ్చు. ఇతర ముఖ్య ఫీచర్లలో రైజెన్ 5 ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ AMD గ్రాఫిక్స్, 8GB RAM, 512GB SSD స్టోరేజీ, అలెక్సా వాయిస్ సపోర్ట్ ఉన్నాయి. (HP India) ఇ-స్టోర్‌లో ధర రూ. 49,999కు అందుబాటులో ఉంది.

Best Laptops in April (Photo : Google Images)

Read Also : Lava Blaze 2 Launch : రూ.8,999కే లావా బ్లేజ్ 2 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

లెనోవో ఐడియా ప్యాడ్ Slim 3 Gen 6 :
HP 14 ల్యాప్‌టాప్ మాదిరిగానే, IdeaPad స్లిమ్ 3 Gen 6 అనేది ఆఫీసు లేదా కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఆప్షన్. ఈ ల్యాప్‌టాప్ కూడా అదే AMD రైజెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB RAM (4×2), 512GB స్టోరేజీతో వస్తుంది. 15.6-అంగుళాల Full-HD డిస్‌ప్లే, భారీ 45W బ్యాటరీ (HPలో 41Whr బ్యాటరీ)తో వచ్చింది. లెనోవో ల్యాప్‌టాప్‌లో ప్రైవసీ షట్టర్ కూడా ఉంది. అయితే, ట్రాక్‌ప్యాడ్ ప్లేస్‌మెంట్ కొంతమంది కస్టమర్‌లకు చికాకు కలిగించవచ్చు. (Lenovo India) ఇ-స్టోర్‌లో ధర రూ. 48,990 నుంచి అందుబాటులో ఉంది.

Best Laptops in April (Photo : Google Images)

Asus Vivobook ఫ్లిప్ 14 :
అద్భుతమైన ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అయితే, Vivobook ఫ్లిప్ 14 ల్యాప్‌టాప్ మీ బెస్ట్ ఆప్సన్. ఈ ల్యాప్‌టాప్-కమ్-టాబ్లెట్ వినియోగ కేసును అందించే ప్రత్యేక హింగ్‌లను కలిగి ఉంది. మూవీలను చూడాలనుకునే వారికి లేదా ఖాళీ సమయంలో నేరుగా PCలో చదవాలనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది.

Best Laptops in April (Photo : Google Images)

(Vivobook) ఫ్లిప్ 14లో 11వ జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్, 8GB RAM, 512GB SSD స్టోరేజ్ ఉన్నాయి. స్టైలస్‌కు సపోర్టుతో 14-అంగుళాల Full-HD టచ్-ఎనేబుల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రత్యేక హింగ్‌లు ఉన్నప్పటికీ.. Vivobook Flip 14 కేవలం 1.5kg బరువు ఉంటుంది. (Asus India) ఇ-స్టోర్‌లో ధర రూ. 44,990 నుంచి అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ X1 :
ఇన్ఫినిక్స్ (Infinix) స్మార్ట్‌ఫోన్‌లకు బాగా పాపులర్ అని చెప్పవచ్చు. అయితే, ఈ బ్రాండ్ డబ్బు కోసం విలువైన ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేస్తోంది. మీరు ట్రేడేషనల్ బ్లాక్ కలర్‌లో లిస్టులో మల్టీ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అన్ని ఫీచర్లు కలిగిన ఏకైక నోట్‌బుక్ కూడా ఇదే.

Best Laptops in April (Photo : Google Images)

అయితే, 8GB RAM, 512GB స్టోరేజ్‌తో మధ్యస్థంగా కోర్ i5 ప్రాసెసర్ (10వ-జనరేషన్)ని కలిగి ఉంది. ఇతర ఫీచర్లు 14-అంగుళాల Full-HD డిస్ప్లే, బ్యాక్‌లిట్ కీబోర్డ్, 55Wh బ్యాటరీని అందిస్తోంది. ఇన్ఫినిక్స్ (Infinix India) ఇ-స్టోర్‌లో ధర రూ. 45,999 నుంచి అందుబాటులో ఉంది.

Mi నోట్‌బుక్ ప్రో :
కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? Mi నోట్‌బుక్ ప్రోని పొందవచ్చు. ప్రస్తుతం, ల్యాప్‌టాప్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 3వేల విలువైన డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. మెటల్ బాడీ, 2.5K QHD+ 14-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

Best Laptops in April (Photo : Google Images)

హుడ్ కింద, 11వ జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్ ఉంది. మెటల్ బాడీ ఉన్నప్పటికీ, ల్యాప్‌టాప్ బరువు 1.4 కిలోలు, అత్యంత పోర్టబుల్‌గా ఉంటుంది. Mi నోట్‌బుక్ ప్రోలో పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా అందిస్తుంది. (Mi India) ఇ-స్టోర్‌లో ధర రూ. 50,999 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : AI Crack Password : ఏఐ(AI)తో జాగ్రత్త.. మీ పాస్‌వర్డ్ ఏదైనా క్షణాల్లో పసిగట్టేయగలదు.. సేఫ్‌గా ఉండాలంటే తప్పకుండా ఇలా చేయండి!