AI Crack Password : ఏఐ(AI)తో జాగ్రత్త.. మీ పాస్‌వర్డ్ ఏదైనా క్షణాల్లో పసిగట్టేయగలదు.. సేఫ్‌గా ఉండాలంటే తప్పకుండా ఇలా చేయండి!

AI Crack Password : మీ పాస్‌వర్డ్ సురక్షితమేనా? పాస్‌వర్డ్ ఏదైనా సరే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిటికెలో పట్టేయగలదు. ఈ AIతో సాధారణ పాస్‌వర్డ్‌లను నిమిషం కన్నా తక్కువ వ్యవధిలోనే క్రాక్ చేయొచ్చునని కొత్త అధ్యయనం తెలిపింది. సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

AI Crack Password : ఏఐ(AI)తో జాగ్రత్త.. మీ పాస్‌వర్డ్ ఏదైనా క్షణాల్లో పసిగట్టేయగలదు.. సేఫ్‌గా ఉండాలంటే తప్పకుండా ఇలా చేయండి!

AI Crack Password (Photo : Google Images)

AI Crack Password : టెక్నాలజీ రోజురోజుకీ మరింత అడ్వాన్స్ అవుతోంది. ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీ టూల్స్ (AI Tools) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ (Artificial Intelligence) టెక్నాలజీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ టెక్నాలజీతో అనేక పనులను తక్కువ సమయంలోనే చేయొచ్చు.

ఏఐ టెక్నాలజీతో ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంతే ముప్పు కూడా పొంచి ఉంది. గత రెండు నెలల్లో ప్రపంచ దేశాల్లో AI గురించి ఆందోళనలు నెలకొన్నాయి. సైబర్‌ సెక్యూరిటీతో పాటు ఆన్‌లైన్ వినియోగదారుల ప్రైవసీని కూడా దెబ్బతీయగలదని అంటున్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. సాధారణంగా ఉపయోగించే ఆన్‌లైన్ పాస్‌వర్డ్‌లకు రిస్క్ ఉందని తేలింది. ఎందుకంటే.. ఇలాంటి పాస్‌వర్డులను AI టెక్నాలజీ నిమిషంలోపే ఛేదించగలదు.

నిమిషం లోపే పాస్‌వర్డ్‌లను ఏఐ క్రాక్ చేయగలదు :
ఆన్‌లైన్ యూజర్లు సాధారణంగా ఉపయోగించే 50 శాతం పాస్‌వర్డ్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిమిషంలోపే ఛేదించవచ్చని హోమ్ సెక్యూరిటీ హీరోస్ (Home Security Heroes) ఇటీవల అధ్యయనంలో తేలింది. అధ్యయనం ప్రకారం.. 15,680,000 పాస్‌వర్డ్‌ల లిస్టును టెస్టింగ్ చేసేందుకు (PassGAN) అనే AI పాస్‌వర్డ్ క్రాకర్‌ (Password Cracker)ను ఉపయోగించింది.

Read Also : AI ChatGPT : భవిష్యత్తులో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే ఆధిపత్యమా? అంటే.. ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందంటే?

అంటే. దాదాపు 51 శాతం సాధారణ పాస్‌వర్డ్‌లను ఒక నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో పసిగట్టేయగలదు. 65 శాతం పాస్‌వర్డ్‌లను గంటలోపే క్రాక్ చేయగలదని వెల్లడించింది. అంతేకాకుండా.. ఒక నెలలో 81 శాతం పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయగలదని కూడా అధ్యయనం పేర్కొంది. ఏఐ టెక్నాలజీ.. నిజానికి మీ పాస్‌వర్డ్‌ను ఒక నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో గుర్తించగలదు.

మీరు సెట్ చేసిన పాస్‌వర్డ్ లెన్త్ అనేది చాలా చిన్నదిగా ఉంటే మాత్రం ఏఐ క్షణాల్లోనే పసిగట్టేయగలదు. చిన్న పాస్‌వర్డులను మాత్రమే ఏఐ గుర్తించడం సాధ్యమవుతుందని గమనించాలి. ఉదాహరణకు.. మీ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైనవి పాస్‌వర్డుగా సెట్ చేస్తే మాత్రం వెంటనే క్రాక్ చేయగలదు. అదే.. లెటర్స్, సింబల్స్ వంటి 18 అక్షరాల లాంగ్ ఉండే పాస్‌వర్డ్‌లను గుర్తించడానికి ఏఐకి ఎక్కువ సమయం పడుతుంది.

AI Crack Password _ AI might crack your password in less than a minute, here is what you can do to stay safe

AI Crack Password (Photo : Google Images)

అధ్యయనం ప్రకారం.. 18 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పాస్‌వర్డ్‌లు సాధారణంగా AI పాస్‌వర్డ్ క్రాకర్ల నుంచి సురక్షితంగా ఉంటాయని తెలిపింది. కేవలం నంబర్‌లు మాత్రమే ఉండే పాస్‌వర్డులను క్రాక్ చేసేందుకు కనీసం 10 నెలల సమయం పట్టింది. అదేవిధంగా, సింబల్స్, సంఖ్యలు, క్యాపిటల్, స్మాల్ అక్షరాల కలయికతో కూడిన పాస్‌వర్డ్‌లు అత్యంత సురక్షితమైనవిగా పేర్కొంది. ఎందుకంటే.. వాటిని క్రాక్ చేయడానికి ఏఐ (AI)కి ఆరు క్విన్టిలియన్ సంవత్సరాల వరకు పట్టవచ్చు.

పాస్‌వర్డ్ సేఫ్‌గా ఉంచుకోవడం ఎలా? :
మీ ఆన్‌లైన్ అకౌంట్లు సేఫ్‌గా ఉండాలంటే.. సాధారణ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవద్దు. కేవలం నెంబర్లు కాకుండా స్పెషల్ క్యారెక్టర్ సింబల్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. కనీసం 15 అక్షరాల పొడవు ఉండే పాస్‌వర్డ్‌లను ఎంచుకోవాలి. అందులో లెటర్స్, సింబల్స్, నెంబర్లు, అప్పర్, లోయర్-కేస్ అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. ఈ టైప్ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టమే.. అప్పుడు ఇలాంటి పాస్‌వర్డులను స్టోర్ చేయడానికి మీరు పాస్‌వర్డ్ మేనేజర్ (Password Manager)ని ఉపయోగించవచ్చు.

ఒకరి పాస్‌వర్డ్‌లో కనీసం రెండు అక్షరాలు (క్యాపిటల్, స్మాల్ లెటర్స్), సంఖ్యలు, సింబల్స్ ఉండాలని కూడా అధ్యయనం చెబుతోంది. 3 లేదా 6 నెలలకోసారి మీ పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం కూడా ఒక ప్రాక్టీస్‌గా కొనసాగించాలని సూచించింది. చివరగా, అన్ని అకౌంట్లకు ఒకే సాధారణ పాస్‌వర్డ్‌ని ఉపయోగించకూడదు. ఇది అత్యంత ప్రమాదకరమని అధ్యయనం హెచ్చరిస్తోంది.

Read Also : Lava Blaze 2 Launch : రూ.8,999కే లావా బ్లేజ్ 2 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!