Invest in Gold: బంగారం కొంటున్నారా? పసిడిపై పెట్టుబడి పెడితే ఎన్ని లాభాలో తెలుసా? కష్టమన్న మాటే మీ నోట రాదు..
బంగారంపై ఎటువంటి పెట్టుబడులు ఉంటాయో కూడా తెలుసుకోవాల్సిందే.

బంగారం మన వద్ద ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి. మన దగ్గర డబ్బులేనప్పుడు బంగారం మనకు కొండంత అండగా నిలుస్తుంది. మన ఉద్యోగం పోయినా, ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి డబ్బు లేకపోయినా బంగారంపై రుణాలు తీసుకోవచ్చు, లేదంటే పసిడిని అమ్మి డబ్బు పొందొవచ్చు.
బంగారంపై పెట్టుబడి పెడితే ఎప్పటికీ లాభమే కానీ నష్టాలు ఉండవు. పసిడిలో పెట్టుబడి అనేది ఓ మంచి బిజినెస్ ఐడియా. ఎన్నో ఏళ్లుగా మనకు అనేక రకాలుగా బంగారం ఉపయోగపడుతోంది. పసిడి ఒక స్థిరాస్తి. దీనిపై పెట్టుబడి వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేలా..
దేశంలో ద్రవ్యోల్బణం ఉన్నట్టుండి పెరిగితే దాని నుంచి పసిడి రక్షిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గవచ్చు, కానీ బంగారం ధర పెరుగుతుంది. మార్కెట్లో ఉన్న ధరలకు అతీతంగా పసిడిని డబ్బుగా మార్పించుకోవచ్చు.
అన్ని దేశాల్లోనూ పసిడి చెల్లుబాటు చేసుకునేందుకు సౌకర్యాలు ఉన్నాయి. పసిడిలో పెట్టుబడులు కొన్ని సందర్భాల్లో ట్యాక్సుల పరంగానూ లాభదాయంకం. పసిడి మినహా ఇతర ఇన్వెస్ట్‌మెంట్లలో ఇలాంటి ప్రయోజనాలను పొందలేరు.
దీంతో పసిడిపై పెట్టుబడి స్వర్గధామం వంటిదని అంటారు. మీ కుటుంబం ఆర్థికంగా కుంగిపోయినా, మీ ఫ్యామిలీ అనుకోని విధంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పసిడి వాటి నుంచి బయటపడేస్తుంది. మార్కెట్ కుప్పకూలినా, బంగారం విలువ స్థిరంగా ఉండే అవకాశం అధికం.
బంగారంపై ఎటువంటి పెట్టుబడులు ఉంటాయో కూడా తెలుసుకోవాలి. ఫిజికల్ గోల్డ్‌గా బంగారాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. అంటే బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, గోల్డ్ బార్ల వంటి వాటిపై పెట్టుబడులు పెట్టవచ్చు. డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే పేటీఎం వంటి యూపీఐ మొబైల్ వాలెట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
పేపర్ గోల్డ్‌లలోనూ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్ బాండ్లతో పాటు ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టొచ్చు. వీటి ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని, భద్రతను పొందవచ్చు. బంగారం విలువ కాలానుగుణంగా పెరుగుతూనే ఉంటుంది.