Best Selling Bikes 2026 : కొత్త బైక్ కొంటున్నారా? 2026లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులివే.. ఏది కొంటారో మీదే ఛాయిస్..!

Best Selling Bikes 2026 : కొత్త బైక్ కావాలా? భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన బైక్ ఏది కొంటారో మీరే డిసైడ్ చేసుకోండి.

Best Selling Bikes 2026 : కొత్త బైక్ కొంటున్నారా? 2026లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులివే.. ఏది కొంటారో మీదే ఛాయిస్..!

Best Selling Bikes (Image Credit To Original Source)

Updated On : January 10, 2026 / 6:32 PM IST
  • 2026లో అత్యధికంగా అమ్ముడయ్యే అదిరిపోయే బైకులు
  • హీరో స్ప్లెండర్ మొత్తం 3.48 లక్షలు యూనిట్లు
  • హోండా షైన్ మొత్తం 1.86 లక్షల యూనిట్లు
  • బజాజ్ పల్సర్ అత్యధికంగా అమ్ముడైన మూడో బైక్
  • గత నవంబర్‌లో మొత్తం 1.13 లక్షల యూనిట్లు

Best Selling Bikes 2026 : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో కార్ల కన్నా బైక్‌లకే ఫుల్ డిమాండ్. ఎక్కువ మంది బైకులనే కొనేందుకు ఇష్టపడుతున్నారు. అందులో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వ్యక్తులు, తమ రోజువారీ ప్రయాణాలకు, ఆఫీసులకు వెళ్లేందుకు ఈ బైకులను తెగ కొనేస్తున్నారు.

మీరు కూడా కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ స్టోరీ మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో లభించే బైకుల్లో ఏది కొనాలో అర్థం కావడం లేదా? మీరు ముందుగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హీరో స్ప్లెండర్ :
భారత మార్కెట్లో హీరో స్ప్లెండర్ అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. గత నవంబర్‌లో మొత్తం 3.48 లక్షల యూనిట్లు అమ్ముడైంది. హీరో స్ప్లెండర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 73,902 నుంచి లభ్యమవుతుంది.

Best Selling Bikes

Best Selling Bikes (Image Credit To Original Source)

హోండా షైన్ :
భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో హోండా షైన్ కూడా ఒకటి. గత ఏడాది నవంబర్‌లో మొత్తం 1.86 లక్షల యూనిట్ల హోండా షైన్ అమ్ముడైంది. హోండా షైన్ 125 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,352 నుంచి లభ్యమవుతోంది.

Read Also : Upcoming TVS Scooters : ఈ నెలలో రాబోయే 5 బెస్ట్ అప్‌కమింగ్ TVS ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్లు, ధర, రేంజ్ ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్

బజాజ్ పల్సర్ :
భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ అత్యధికంగా అమ్ముడైన మూడో బైక్. గత నవంబర్‌లో మొత్తం 1.13 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. బజాజ్ పల్సర్ ధరలు రూ. 79,048 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

హీరో HF డీలక్స్ :
భారత మార్కెట్లో సరసమైన ధరలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో హీరో HF డీలక్స్ ఒకటి. గత నెలలో ఈ బైకు మోడల్ 91,082 యూనిట్లు అమ్ముడయ్యాయి. హీరో HF డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 58,739 నుంచి ప్రారంభమవుతుంది.

టీవీఎస్ అపాచీ :
టీవీఎస్ అపాచీ బైక్ కూడా భారత మార్కెట్లో బాగా పాపులర్ అయింది. గత నెలలో టీవీఎస్ అపాచీ మొత్తం 48,764 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.12 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.