మీ ఇంట్లో ఉన్న పాత డొక్కు టీవీని పక్కన పడేసి, కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? కానీ బడ్జెట్ తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? ఇక ఆ కంగారు వద్దు.. అమెజాన్‌లో స్మార్ట్ టీవీలపై కనీవినీ ఎరుగని ఆఫర్లు నడుస్తున్నాయి. కేవలం రూ.5,999 ప్రారంభ ధరతో, 68% వరకు భారీ డిస్కౌంట్‌తో అద్భుతమైన స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.
యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అన్నీ చూసేయొచ్చు. మీ జేబుకు చిల్లు పడకుండా, మీ ఇంటికి సరిపోయే బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు ఏవో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ టీవీలు
VW (24 అంగుళాలు)
చిన్న గదులకు, అతి తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఫ్రేమ్‌లెస్ డిజైన్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది.
Kodak (24 అంగుళాలు) – నమ్మకమైన బ్రాండ్
కొడాక్ బ్రాండ్ నుంచి అందుబాటులో ఉన్న ఈ టీవీ కూడా మంచి ఆప్షన్. సౌండ్ కొంచెం తక్కువైనా, బ్రాండ్ వ్యాల్యూ కోరుకునే వారికి ఇది నచ్చుతుంది.
Skywall (32 అంగుళాలు) – బెస్ట్ ఆండ్రాయిడ్ డీల్
కేవలం రూ.7,299కే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 30W పవర్‌ఫుల్ సౌండ్ అందిస్తున్న ఈ టీవీ ఈ లిస్ట్‌లో ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజ్.
VW (32 అంగుళాలు)
కాస్త పెద్ద స్క్రీన్, ఆండ్రాయిడ్ ఓఎస్ కావాలనుకుంటే VW 32-అంగుళాల మోడల్ మంచి ఆప్షన్. ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో ఇంటికి కొత్త అందాన్ని ఇస్తుంది.
Kodak (32 అంగుళాలు) – సినిమాటిక్ సౌండ్
మంచి డిస్‌ప్లేతో పాటు, పవర్‌ఫుల్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే ఈ Kodak టీవీ బెస్ట్. 30W సౌండ్ అవుట్‌పుట్‌తో సినిమా హాల్ అనుభూతిని పొందవచ్చు.
Smart TV కొనే ముందు ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి..
స్క్రీన్ సైజ్: మీ గది చిన్నగా ఉంటే 24 అంగుళాలు సరిపోతుంది. హాల్ లేదా పెద్ద గది కోసం అయితే 32 అంగుళాలు లేదా అంతకంటే పెద్ద సైజ్ ఎంచుకోవడం ఉత్తమం.
ఆపరేటింగ్ సిస్టమ్ (OS): Linux OS టీవీలు వేగంగా పనిచేస్తాయి, కానీ పరిమిత యాప్స్ మాత్రమే ఉంటాయి. Android OS టీవీలలో మీరు ప్లే స్టోర్ నుంచి వేలకొద్దీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సౌండ్ అవుట్‌పుట్: సాధారణంగా 20W సౌండ్ సరిపోతుంది. కానీ మీకు సినిమాటిక్ అనుభూతి కావాలంటే 24W లేదా 30W సౌండ్ ఉన్న టీవీలను ఎంచుకోండి.
ఈ ఆఫర్స్ ఎప్పుడైనా మారవచ్చు, కాబట్టి మీకు నచ్చిన టీవీని అమెజాన్‌లో వెంటనే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి..