OnePlus vs Samsung: ఈ 2 స్మార్ట్‌ఫోన్లు ఇంత అద్భుతంగా ఉన్నాయ్‌.. ఏది కొనాలని కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా? ఏది బెస్ట్‌ అంటే..?

ఏ ఫోన్ ఎవరికి నచ్చుతుంది? 

OnePlus vs Samsung: ఈ 2 స్మార్ట్‌ఫోన్లు ఇంత అద్భుతంగా ఉన్నాయ్‌.. ఏది కొనాలని కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా? ఏది బెస్ట్‌ అంటే..?

OnePlus Nord 5 vs Samsung Galaxy A56

Updated On : July 10, 2025 / 3:04 PM IST

ఒకే బడ్జెట్‌లో రెండు పవర్‌ఫుల్ ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. ఒకటి వన్‌ప్లస్ నార్డ్ 5 5G. మరొకటి శాంసంగ్‌ గెలాక్సీ A56 5G. ఏది కొనాలని కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా? వన్‌ప్లస్ నార్డ్ 5 5G పెర్ఫార్మెన్స్‌కు ఏదీ సాటిలేదు. ఇక శాంసంగ్‌ గెలాక్సీ A56 5G తన బ్రాండ్ వాల్యూ, కెమెరా ఫీచర్లతో ఆకర్షిస్తోంది. మరి ఈ రెండింటిలో మీకు ఏది సరైన ఫోన్? ఈ తేడాలు చూస్తే మీకే అర్థమవుతుంది.

ఫీచర్ OnePlus Nord 5 5G Samsung Galaxy A56 5G
ప్రాసెసర్ Snapdragon 8s Gen3 Exynos 1580
బ్యాటరీ 6800mAh (భారీ బ్యాటరీ) 5000mAh
చార్జింగ్ 80W ఫాస్ట్ చార్జింగ్ 45W ఫాస్ట్ చార్జింగ్
డిస్‌ప్లే 6.83″ AMOLED, 144Hz రిఫ్రెష్ రేట్ 6.7″ Super AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్
కెమెరా 50MP డ్యూయల్ కెమెరా, 50MP సెల్ఫీ 50MP ట్రిపుల్ కెమెరా, 12MP సెల్ఫీ
ధర రూ.31,999 రూ.38,999

వన్‌ప్లస్ నార్డ్ 5 5G పనితీరు
పనితీరు విషయంలో OnePlus తగ్గేదే లే అంటోంది. ఇందులో శక్తిమంతమైన Snapdragon 8s Gen3 ప్రాసెసర్ ఉంది. దీనివల్ల హై-ఎండ్ గేమ్స్, 4K వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ వంటివి సులువుగా ఉంటాయి. దీనికి తోడు 8GB RAM + 8GB వర్చువల్ RAM సపోర్ట్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది నచ్చుతుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A56 5G పెర్ఫార్మెన్స్‌
ఇందులో Samsung సొంత Exynos 1580 ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులకు, సాధారణ గేమింగ్‌కు ఇది సరిపోతుంది. కానీ, OnePlusతో పోలిస్తే కచ్చితంగా ఇది కొంచెం వెనుకబడింది. ఇందులో వర్చువల్ RAM సపోర్ట్ కూడా లేదు.

డిస్‌ప్లే, బ్యాటరీ విషయంలో…

వన్‌ప్లస్ నార్డ్ 5 5G
ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల భారీ AMOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల స్క్రీన్‌పై స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే, 6800mAh భారీ బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. దానికి తోడు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అవుతుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A56 5G
Samsung Super AMOLED డిస్‌ప్లేలు, కలర్స్‌ విషయంలో పేరు తెచ్చుకుంది. ఇందులో 6.7 అంగుళాల స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అయితే, OnePlusతో పోలిస్తే బ్యాటరీ 5000mAh మాత్రమే, ఛార్జింగ్ కూడా 45W మాత్రమే.

పెద్ద స్క్రీన్, స్మూత్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్… ఇలా అన్ని విభాగాల్లోనూ OnePlus Nord 5 5G ముందంజలో ఉంది.

కెమెరా
వన్‌ప్లస్ నార్డ్ 5 5G
ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. OIS (Optical Image Stabilization) ఉండటంతో వీడియోలు షేక్ అవ్వకుండా వస్తాయి. అయితే, ఈ ఫోన్ అసలైన హైలైట్ 50MP సెల్ఫీ కెమెరా. సోషల్ మీడియా లవర్స్, సెల్ఫీ ప్రియులకు ఇది బాగా నచ్చుతుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A56 5G 
కెమెరాలో వైవిధ్యం కావాలనుకునే వారికి Samsung బెస్ట్ ఆప్షన్. ఇందులో 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్, 5MP మ్యాక్రో లెన్స్‌లతో మూడు కెమెరాల సెటప్ ఉంది. దీనివల్ల మీరు విభిన్నమైన ఫోటోలు (వైడ్ యాంగిల్, క్లోజప్ షాట్స్) తీయవచ్చు. అయితే సెల్ఫీ కెమెరా 12MP మాత్రమే.

ఎక్కువ మెగాపిక్సెల్ సెల్ఫీల కోసం OnePlus, విభిన్న రకాల ఫొటోల కోసం Samsung మంచి ఆప్షన్. ఇది మీ వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

ఏ ఫోన్ ఎవరికి నచ్చుతుంది?
వన్‌ప్లస్ నార్డ్ 5 5G వీళ్లు కొనొచ్చు (రూ.31,999)

  • అద్భుతమైన పెర్ఫార్మెన్స్, గేమింగ్ కావాలంటే.
  • రోజంతా ఛార్జింగ్ ఆగకూడదనుకుంటే.
  • వేగంగా ఛార్జ్ అవ్వాలనుకుంటే.
  • హై-క్వాలిటీ సెల్ఫీలు మీ ప్రాధాన్యం అయితే.

శాంసంగ్‌ గెలాక్సీ A56 5G వీళ్లు కొనొచ్చు.. (రూ.38,999)

  • మీకు Samsung బ్రాండ్ అంటే నమ్మకం, ఇష్టం ఉంటే.
  • కెమెరాలో మ్యాక్రో, అల్ట్రావైడ్ వంటి ఎక్కువ ఆప్షన్లు కావాలంటే.
  • Samsung వన్ యూఐ (One UI) సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకుంటే.