GST Rates Cut : షాపింగ్ చేసేవారికి బిగ్ అలర్ట్.. జీఎస్టీ రేట్లు తగ్గాయని తొందరపడి కొనొద్దు.. ఏదైనా కొనే ముందు ఈ స్టోరీ చదివి వెళ్లండి..!
GST Rates Cut : జీఎస్టీ రేట్లు తగ్గాయని ఏది పడితే అది తొందరపడి కొనేయకండి.. ఇలాంటిటప్పుడే తేలివిగా ఆలోచించండి. ఈ ట్రాప్‌లో అసలు పడొద్దు..

Big Alert for Shoppers
GST Rates Cut : అసలే పండగ సీజన్.. అందులోనూ జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయి. ఒకవైపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. మరోవైపు బైకులు, కార్ల ధరలను భారీగా తగ్గుతున్నాయి. ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు ఇంతకన్నా సరైన సమయం ఉండదని అనుకుంటున్నారా అయితే, ఒక్క క్షణం ఆగండి.. తొందరపడి షాపింగ్ చేసేందుకు పరిగెత్తకండి.
ఎందుకంటే.. ఇప్పటివరకూ కొత్త వస్తువు కొనేవాళ్లంతా జీఎస్టీ రేట్లు ఎప్పుడు తగ్గుతాయా? అని ఎదురుచూశారు. ఇప్పుడు తగ్గిన జీఎస్టీ రేట్లు కూడా అధికారికంగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ రేట్లు తగ్గాయి.. మీరు కొనే వస్తువు కూడా తగ్గింపు ధరకే వస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది.
పాత స్టాక్ అంటగడతారు జాగ్రత్త :
అలా అని తొందరపడి ఏదైనా వస్తువు కొన్నారంటే ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. చాలా కంపెనీలు తమ ప్రొడక్టులను తొందరగా సేల్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో మిగిలిపోయిన పాత స్టాక్ రెడీగా ఉంటుంది. మీరు జీఎస్టీ రేట్లు తగ్గిన వెంటనే కొంటే.. ఆ పాత స్టాక్ వస్తువులను మీకు అంటగట్టే అవకాశం ఉంది. అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది.
జీఎస్టీ రేట్లు అనేవి ఒక్కరోజుతో ఆగేది కాదు.. కొత్తగా అమల్లోకి వచ్చిన వెంటనే పెద్దగా హైరానా పడాల్సిన పనిలేదు. ఈరోజు కొన్నా లేదా రేపు లేదా నెలకు కొన్నా జీఎస్టీ రేట్లు అలాగే ఉంటాయి. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ ప్రస్తుతం పండగ సేల్ ఆన్ లైన్ ఆఫర్లు ఉన్నాయి కదా మళ్లీ ఆఫర్ ముగుస్తుందనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు కొనాల్సిన వస్తువు వెంటనే కొనేసుకోవచ్చు. కానీ, ఇక్కడ జీఎస్టీ రేట్లు అనేవి మళ్లీ ప్రభుత్వం పెంచేవరకు అలానే ఉంటాయి.
అందుకే మీరు అర్జంటుగా షాపింగ్ చేయాల్సిన పనిలేదు. కొద్దిరోజులు ఆగడమే బెటర్.. ఈ టైమ్ లో మార్కెట్లో మిగిలిపోయిన స్టాక్ ఎవరో ఒకరు కొనేయడంతో అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రీగా మీకు కావాల్సిన వస్తువు కొనేసుకోవచ్చు. అప్పటికే పాత స్టాక్ అయిపోయి ఉంటుంది. మీకు కొత్త స్టాక్ వస్తువు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట.
అందరూ చేసే తప్పులివే :
కానీ, చాలామంది ఎక్కడ ఆఫర్లు ముగుస్తాయోనని ముందుగానే తొందరపడి కొనేస్తుంటారు. పాత స్టాక్ తక్కువ ధరకు వస్తుందని కొన్న తర్వాత అందులో ఏమైనా డిఫెక్ట్ ఉంటే మళ్లీ రిప్లేస్ రిటర్న్ అంటూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కాస్తా కొన్ని రోజులు ఆగడమే మంచిది. ఇలా చేయడం ద్వారా మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది? ఏయే వస్తువులకు డిమాండ్ ఉంది? అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే లేటు అయినా లేటెస్ట్ వస్తువు కొంటారు.
ఇలా మోసపోవద్దు :
అలా కాదని జీఎస్టీ తగ్గిన వెంటనే కొత్త వస్తువు కొనేందుకు ప్రయత్నిస్తే పాత స్టాక్ అంటగడతారు జాగ్రత్త.. ప్రస్తుతం చాలామంది వ్యాపారులు పాత స్టాక్ పేరుతో అదే వస్తువు మీద తక్కువ జీఎస్టీ కాకుండా పాత అధిక జీఎస్టీ బిల్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. పాత రేటుకు తెచ్చిన స్టాక్ కావునా పాత జీఎస్టీనే వసూలు చేస్తున్నామని అంటారు.
ఇందులో నిజం లేదు.. ఎందుకో తెలుసా? జీఎస్టీ తగ్గిన రోజుతో మొదలైన స్టాక్ పై కూడా మిగిలిన స్టాక్ అయినా సరే కొత్త జీఎస్టీ రేటు వర్తిస్తుంది. వినియోగదారుడు పేమెంట్ చేసే రోజున చెల్లుబాటు అయ్యే జీఎస్టీ రేటు ప్రకారమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. పాత స్టాక్ తో కస్టమర్లకు సంబంధం ఉండదు. కొంతమంది జీఎస్టీ తగ్గిన తర్వాత కూడా కొత్త వస్తువులు అని చెప్పి పాత స్టాక్ అని చెప్పి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఇలా ఫిర్యాదు చేయండి :
మీరు కొన్న వస్తువుపై పాత జీఎస్టీ పడిందా? లేదా కొత్త జీఎస్టీ ప్రకారమే పడిందా అనే విషయం కూడా తప్పక తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు కొనే వస్తువు ఇన్ వాయిస్ లేదా బిల్లు చెక్ చేయండి అందులో జీఎస్టీ రేటు వివరాలు ఉంటాయి. రీసెంట్ జీఎస్టీ తగ్గిన వస్తువుల జాబితను కూడా చెక్ చేయండి. పాత జీఎస్టీ రేటుతో బిల్లు ఇస్తే వెంటనే వివరణ అడగండి. అవసరమైతే కన్స్యూమర్ హెల్స్ లైన్ కు ఫిర్యాదు చేయండి. లేదంటే జీఎస్టీ ఫిర్యాదు పోర్టల్ కు (https://selfservice.gstsystem.in/)లో ఫిర్యాదు చేయండి.