GST Rates Online : జీఎస్టీ 2.0 కొత్త రేట్లు : ఒక వస్తువుపై అసలు GST తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

GST Rates Online : తగ్గిన జీఎస్టీ రేట్లను ఎలా తెలుసుకోవాలి? ఆన్‌లైన్ ద్వారా ఇలా ఈజీగా జీఎస్టీ రేట్లను ట్రాక్ చేయొచ్చు.. ఓసారి లుక్కేయండి.

GST Rates Online : జీఎస్టీ 2.0 కొత్త రేట్లు : ఒక వస్తువుపై అసలు GST తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

GST Rates Online

Updated On : September 21, 2025 / 7:33 PM IST

GST Rates Online : మీరు ఏదైనా వస్తువు కొందామని అనుకుంటున్నారా? సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై గుడ్స్ అండ్ సర్వీసు టాక్స్ పడుతుంది. ప్రతి ఆన్ లైన్ కొనుగోలుపై జీఎస్టీ (GST Rates Online) వర్తిస్తుంది. అయితే, చాలామందికి ఏయే వస్తువుపై ఎంతమొత్తంలో జీఎస్టీ పడుతుందో పెద్దగా అవగాహన ఉండదు. ఒకవేళ మీరు కూడా ఏదైనా వస్తువు కొనుగోలు చేసేందుకు చూస్తుంటే ఇది మీకోసమే..

మీరు కొనబోయే వస్తువుపై ఎంతవరకు జీఎస్టీ పడుతుందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే, ఆయా వస్తువులపై ఎంతవరకు జీఎస్టీ తగ్గిందో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఒక వస్తువు జీఎస్టీ (గుడ్ & సర్వీస్ ట్యాక్స్) ఎంత తగ్గిందో తెలుసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

ఒక వస్తువు జీఎస్టీ రేటు 18శాతం నుంచి 12శాతానికి తగ్గినప్పుడు మీరు గతంలో కడుతున్న జీఎస్టీతో పోలిస్తే ఇప్పుడు తక్కువ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ తగ్గిన వస్తువుకు బిల్లు లేదా ఇన్‌వాయిస్‌లో కూడా కొత్త జీఎస్టీ రేటు అప్లయ్ అవుతుంది.మీరు జీఎస్టీ తగ్గినా లేదా పెరిగినా కూడా ఆయా వివరాలను ఈజీగా ట్రాక్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. జీఎస్టీ పోర్టల్ చెక్ చేయండి :

జీఎస్టీ పోర్టల్ ద్వారా మీరు కొనుగోలు చేసే వస్తువుపై ఎంత జీఎస్టీ తగ్గిందో తెలుసుకోవచ్చు. (www.gst.gov.in, http://www.gst.gov.in) అధికారిక పోర్టల్స్ ద్వారా జీఎస్టీకి సంబంధించి అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గతంలో జీఎస్టీ మార్పులు, కొత్త నోటిఫికేషన్లు, వస్తువుల ధరల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

Read Also : New GST Rate Cut : కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. చౌకగా లభించనున్న టీవీలు, ఏసీలు.. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు తగ్గుతాయా?

మీరు చేయాల్సిందిల్లా.. “Tax Rate Changes” లేదా “GST Notifications” సెక్షన్‌లో జీఎస్టీ మార్పుల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వస్తువులపై జీఎస్టీ రేట్లు HSN కోడ్ ఆధారంగా ఉంటాయి. మీరు ఆ కోడ్ ద్వారా కూడా జీఎస్టీలో మార్పులను ట్రాక్ చేయవచ్చు.

2. ప్రభుత్వ నోటిఫికేషన్లు :
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రేట్లను మారుస్తుంటాయి. ఈ మార్పులు ఫైనాన్స్ బడ్జెట్ లేదా నోటిఫికేషన్ల ద్వారా ప్రకటిస్తాయి. ఈ నోటిఫికేషన్లను www.cbic.gov.in, http://www.cbic.gov.in వెబ్‌సైట్‌లో లేదా GST Notifications సెక్షన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

3. జీఎస్టీ రేట్ ఫైండర్ యాప్ (GST Rate Finder App) :
జీఎస్టీ రేట్ ఫైండర్ యాప్ మీ మొబైల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు అవసరమైన వస్తువు/సర్వీసుపై జీఎస్టీ రేట్ తెలుసుకోవచ్చు. HSN కోడ్ ఎంటర్ చేసి ఆ వస్తువు లేదా సర్వీసుపై లేటెస్ట్ జీఎస్టీ రేట్లు తెలుసుకోవచ్చు.

4. జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు :

జీఎస్టీ రేటు మార్పులపై అధికారిక నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర జీఎస్టీ చట్టం ఆధారంగా ప్రతి నెల ఒకటినా లేదా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల తర్వాత విడుదల అవుతాయి. ఈ సమాచారాన్ని మీరు జీఎస్టీ కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్ నుంచి సులభంగా తెలుసుకోవచ్చు.

5. ఆధికారిక వెబ్‌సైట్‌లు, న్యూస్ పేపర్లు :
మీరు నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్, సోషల్ మీడియా, పత్రికలు, రేడియో, టీవీ ప్రసారాల ద్వారా జీఎస్టీ మార్పులకు సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు.

6. సప్లయర్ లేదా డీలర్‌ను సంప్రదించండి :
మీరు ఏదైనా ప్రత్యేక వస్తువుకు సంబంధించి జీఎస్టీ రేట్‌లో మార్పు గురించి సందేహాలు ఉంటే మీ సప్లయర్ లేదా డీలర్‌ను సంప్రదించవచ్చు. జీఎస్టీ మార్పుల వివరాలను వారిని అడిగి తెలుసుకోవచ్చు.

7. వస్తువు సరఫరా చేసిన సంస్థ లేదా మర్చంట్ :
మీరు ఒక వస్తువు లేదా సర్వీసును పొందినప్పుడు మర్చంట్ లేదా సరఫరా చేసే సంస్థ నుంచి కూడా జీఎస్టీ వివరాలను తెలుసుకోవచ్చు. మీరు అడిగితే మీకు సరైన జీఎస్టీ రేటును చెబుతారు. సాధారణంగా జీఎస్టీ రేటును వస్తువు కొనుగోలు చేసిన బిల్లు, ఇన్ వాయిస్ (Invoice)లోనే ఉంటుంది.

8. ఆన్‌లైన్ జీఎస్టీ రేట్ ఫైండర్ టూల్స్ :
మీరు జీఎస్టీ రేట్ ఫైండర్ టూల్స్ ద్వారా కూడా జీఎస్టీ రేట్లలో మార్పులను తెలుసుకోవచ్చు. ఈ టూల్స్ ద్వారా మీరు వస్తువు పేరు లేదా HS Code (హార్మనైజ్డ్ సిస్టమ్ కోడ్) సాయంతో జీఎస్టీ రేటు తెలుసుకోవచ్చు.

9. జీఎస్టీ టాక్సబుల్ ఐటమ్స్ లిస్ట్ :
జీఎస్టీ కౌన్సిల్ మొత్తం సరుకు, సేవల జాబితాను అప్‌డేట్ చేస్తుంటుంది. ప్రతి వస్తువు జీఎస్టీ రేటుకు సంబంధించి పూర్తి వివరాలు అప్‌డేట్ చేస్తుంది. మీరు ఈ జాబితా చెక్ చేసి కూడా జీఎస్టీ వివరాలను పొందవచ్చు.

10. ఆన్‌లైన్ జీఎస్టీ రేటు రివ్యూస్ :
కొన్ని వెబ్‌సైట్లు, అప్లికేషన్లలో వినియోగదారులకు సంబంధించి జీఎస్టీ రేటును తెలుసుకోవచ్చు. మీకు కావలసిన వస్తువు జీఎస్టీ రేటును కూడా ఈజీగా తెలుసుకోవచ్చు.